Tokyo 2020 : కోపంతో ప్రత్యర్థి చెవి కొరికిన బాక్సర్

మొరాకొకు చెందిన బాక్సర్ యూనెస్ బాల్లా...న్యూజిలాండ్ బాక్సర్ డేవిడ్ న్యీకా మధ్య పోరు కొనసాగింది. హోరాహోరీగా ఈ పోరు జరిగింది. బౌట్ లో డేవిడ్ నికా తొలి నుంచి అధిపత్యం ప్రదర్శించాడు. యూనెస్ మాత్రం ఎలాంటి ప్రతిభ చూపకపోవడంతో ఓటమి అంచుకు వెళ్లిపోయాడు.

Tokyo 2020 : కోపంతో ప్రత్యర్థి చెవి కొరికిన బాక్సర్

Boxing

Morocco’s Youness Baalla : క్రీడలో గెలుపు ఓటములు సహజం. మ్యాచ్ ఓడిన సందర్భంలో కొంతమంది క్రీడాకారులకు కోపం వస్తుంది. కానీ దానిన అణుచుకుని గెలిచిన జట్టును అభినందిస్తుంటారు. కొంతమంది కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇతరులపై తమ ప్రతాపాన్ని చూపిస్తుంటారు. బ్యాట్ విసిరేయడం, టెన్నిస్ బ్యాట్ కోపం నేలకేసి బాదడం, తన్నడం లాంటివి చేస్తుంటారు. అయితే..ఓ క్రీడాకారుడు తీవ్ర అసహనానికి లోనై..ప్రత్యర్థి చెవిని కొరికివేశాడు. బాక్సింగ్ లో చెవి కొరకడం అనగా మహాబలుడు టైసన్ గుర్తుక వస్తారు. అచ్చూ ఇలాగే టోక్యో ఒలింపిక్ లో జరిగింది.

Read More : Chinese Nuclear Missile Silos: రీసెర్చర్లకు దొరికిన 110 సీక్రెట్ చైనీస్ న్యూక్లియర్ మిస్సైల్ సిలోలు

మొరాకొకు చెందిన బాక్సర్ యూనెస్ బాల్లా…న్యూజిలాండ్ బాక్సర్ డేవిడ్ న్యీకా మధ్య పోరు కొనసాగింది. హోరాహోరీగా ఈ పోరు జరిగింది. బౌట్ లో డేవిడ్ నికా తొలి నుంచి అధిపత్యం ప్రదర్శించాడు. యూనెస్ మాత్రం ఎలాంటి ప్రతిభ చూపకపోవడంతో ఓటమి అంచుకు వెళ్లిపోయాడు. మూడో రౌండ్ లో డేవిడ్ చెవి కొరకడానికి యత్నించాడు. యూనీస్ దంతాలు తగలగానే..చెవి కొరుకుతున్నాడని గుర్తించి..వెంటనే దూరంగా నెట్టేశాడు. ఈ మ్యాచ్ లో డేవిడ్ 5-0 తేడాతో యూనీస్ ను ఓడించాడు.

Read More : Nagpur : పెద్ద పేగుకు సోకిన బ్లాక్ ఫంగస్

యూనెస్ అనుచిత ప్రవర్తనతో ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ అతడిని అనర్హుడిగా ప్రకటించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. Ben Damon ట్విటర్ వేదికగా ట్వీట్ చేశారు. యూనీస్ ప్రవర్తన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.