IPL-2023: అత్యధిక సిక్సులు, ఫోర్లు బాదింది ఎవరు? ఈ జాబితాల్లో కోహ్లీ ఎందుకు లేడు?

ఐపీఎల్ లో కోహ్లీ 11 సిక్సులు, 40 ఫోర్ల సాయంతో 438 పరుగులు చేశాడు.

IPL-2023: అత్యధిక సిక్సులు, ఫోర్లు బాదింది ఎవరు? ఈ జాబితాల్లో కోహ్లీ ఎందుకు లేడు?

IPL-2023

IPL-2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023లో మరికొన్ని లీగ్ మ్యాచులు (League matches) మిగిలి ఉన్నాయి. ఇప్పటివరకు IPLలో 61 మ్యాచులు జరిగాయి. మరో 9 మ్యాచులు జరిగితే లీగ్ మ్యాచులు అయిపోయి, ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచు జరుగుతాయి. ఇప్పటివరకు ఏ బ్యాటర్ అత్యధిక సిక్సులు కొట్టాడో, ఏ బ్యాటర్ అత్యధిక ఫోర్లు బాదాడో చూద్దాం…

డు ప్లెసిస్ అగ్రస్థానం
అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్ల జాబితాలో ఆర్సీబీ బ్యాటర్ డు ప్లెసిస్ అగ్రస్థానంలో ఉన్నాడు. డుప్లెసిస్ ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడి 611 పరుగులు చేయగా, అందులో 34 సిక్సులు ఉన్నాయి. అత్యధిక సిక్సులు కొట్టిన వారిలో రెండో స్థానంలో ఆర్సీబీ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (30 సిక్సులు), మూడో స్థానంలో సీఎస్కే బ్యాటర్ శివం దుబే (30 సిక్సులు), నాలుగో స్థానంలో ఆర్ఆర్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (26 సిక్సులు), అయిదో స్థానంలో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ (25 సిక్సులు) ఉన్నారు.

యశస్వి జైస్వాల్ 74 ఫోర్లు
ఇక అత్యధిక ఫోర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో యశస్వి జైస్వాల్ (74 ఫోర్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. 2, 3, 4, 5, స్థానాల్లో వరుసగా సీఎస్కే బ్యాటర్ కాన్వే (58), ఢిల్లీ క్యాపిటల్స్ డేవిడ్ వార్నర్ (57), ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (52), శుభ్‌మన్ గిల్ (49) ఉన్నారు. కాగా, మార్చి 31 నుంచి ప్రారంభమైన ఐపీఎల్-2023 మే 28న ముగియనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో గుజరాత్ టైటాన్స్ ఉంది.

పాపం కోహ్లీ
అత్యధిక సిక్సులు, అత్యధిక ఫోర్లు బాదిన బ్యాటర్ల జాబితాల్లో స్టార్ బ్యాటర్ కోహ్లీ లేడు. అంతేకాదు, ఆరెంజ్ క్యాప్ రేసులోనూ కోహ్లీ వెనకబడిపోయాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసే బ్యాటర్ కు ఆరెంజ్ క్యాప్ దక్కుతుంది. ఈ జాబితాలో ఆర్సీబీ బ్యాటర్ డు ప్లెసిస్ అగ్రస్థానంలో, రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ రెండో స్థానంలో ఉండగా, కోహ్లీ ఆరో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ లో కోహ్లీ 11 సిక్సులు, 40 ఫోర్ల సాయంతో 438 పరుగులు చేశాడు.

IPL: మరో 10 లీగ్ మ్యాచులే మిగిలాయి.. ఫైనల్ రేసులో ఉన్న జట్లు ఏవి? ఆరెంజ్ క్యాప్ సంగతేంటీ?