ట్రంప్ రాక కోసం రూ.100కోట్ల ఖర్చుతో.. ప్రపంచంలోనే పెద్దదైన స్టేడియంలో!

  • Published By: veegamteam ,Published On : February 19, 2020 / 06:06 AM IST
ట్రంప్ రాక కోసం రూ.100కోట్ల ఖర్చుతో.. ప్రపంచంలోనే పెద్దదైన స్టేడియంలో!

గుజరాత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని భారత్ నిర్మించింది. ఆ స్టేడియం పేరు ‘మోటెరా క్రికెట్ స్టేడియం’. గుజ‌రాత్ అహ్మ‌దాబాద్‌ లోని పాత స‌ర్దార్ వల్ల‌భాయ్ ప‌టేల్ స్టేడియాన్ని కూల్చి కొత్త‌గా నిర్మించారు. ఈ స్టేడియంలో ఇండోర్ గేమ్స్ మాత్రమే కాకుండా క్రికెట్ కూడా ఆడోచ్చు. అంతేకాదు ఒకేసారి ఈ స్టేడియంలో లక్షా పదివేల మంది ప్రేక్షకులు కూర్చొని ఆటలను చూడవచ్చని BCCI స్టేడియం ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలు నెటిజన్లకు బాగా నచ్చేశాయి.

ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ స్టేడియం రికార్డుకు ఎక్కింది. అందులో ల‌క్ష మంది ప్రేక్షకులు కుర్చుని మ్యాచ్ చూడవచ్చు. కానీ, ఇప్పుడు ఆ రికార్డ్‌ గుజరాత్‌లోని మొతెరా స్టేడియానికి దక్కనుంది. ఈ స్టేడియంలో లక్షా పదివేల మంది ప్రేక్షకులు కూర్చొని ఆటలను చూడవచ్చు.  ఇందులో 70 కార్పొరేట్ బాక్స్‌లు ఉండగా.. నాలుగు డ్రెస్సింగ్ రూములు, 50 గదులతో క్లబ్ హౌస్,  పెద్ద స్విమ్మింగ్ పూల్‌‌ కూడా ఏర్పాటు చేశారు.

దీనిలో ఇండోర్ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ కూడా ఉంటుంది. స్టేడియంలో మూడువేల కార్లు, పదివేల మోటార్ సైకిళ్లు పార్కింగ్ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. భార‌త ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ స్టేడియాన్నికి రానున్నారు. అందుకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించడానికి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మోటెరా స్టేడియాన్ని సందర్శించారు.

ట్రంప్ కోసం మోటేరా స్టేడియం నుంచి ఎయిర్ పోర్టుకు తిరిగి వెళ్లే మార్గంలో 1.5 కిలోమీటర్ల  కొత్త రోడ్లను వేయిస్తున్నారు. అహ్మదాబాద్‌లో ట్రంప్ ఉండేది కేవలం 3 గంటలు మాత్రమే. కానీ, ట్రంప్ పర్యటనలో ఏ లోటు లేకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్ల విషయంలో ఎక్కడా తగ్గేట్టు కనిపించడం లేదు. ట్రంప్ కోసం రెడ్ కార్పెట్ ఏర్పాటు చేస్తోంది.

షెడ్యూల్ ప్రకారం.. ట్రంప్ ఫిబ్రవరి 24న అహ్మదాబాద్ లో పర్యటించనున్నారు. ఇందుకు రాష్ట్రప్రభుత్వం దాదాపు రూ.100 కోట్లు వరకు ఖర్చు చేస్తుందంట. ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనకు సంబంధించి ప్రణాళికలను రూపొందించి వాటిని సక్రమంగా ఏర్పాట్లు జరిగేలా అధికారులను రంగంలోకి దించినట్టు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఒక ప్రకటనలో తెలిపారు.