ధోనీ లేకపోవడం వల్లే భారత్ ఓడిపోయింది: పాంటింగ్

ధోనీ లేకపోవడం వల్లే భారత్ ఓడిపోయింది: పాంటింగ్

అందరిలో ఉన్న అభిప్రాయాన్నే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ బయటపెట్టాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లేకపోవడం వల్లే ఆస్ట్రేలియాతో భారత్ వన్డే సిరీస్ కోల్పోయిందంటూ విమర్శలు వచ్చాయి. వీటిన బలపర్చేవిధంగా ఉన్నాయి ఆసీస్ మాజీ కెప్టెన్ పాంటింగ్ మాటలు. వరల్డ్ కప్ ముంగిట జరిగిన ఆఖరి వన్డే సిరీస్‌లో భారత్ 2-3తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. 
Read Also : అదే డబ్బును ఇలా: బీసీసీఐ రూ.20 కోట్లు ఇవ్వనుంది

‘నేను కోహ్లీ కెప్టెన్సీపైన ఎటువంటి వ్యాఖ్యలు చేయను. అలా కొన్నేళ్లుగా టెస్టు ఫార్మాట్‌లో అతని బ్యాటింగ్ చూసేందుకు ఇష్టపడుతున్నా. కానీ, మైదానంలో కోహ్లీ ఒత్తిడికి గురైనట్లుగా కనిపించింది. భారత్ ఒత్తిడికి గురైన ప్రతిసారి మ్యాచ్ ను కోల్పోతుంది. జట్టులో ధోనీ ఉన్నట్లు అయితే కోహ్లీ కాస్త ప్రశాంతంగా కనిపించేవాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి 3వన్డేల్లో కోహ్లీ బ్యాటింగ్‌ను చూసేందుకు కుదరలేదు’ అని పాంటింగ్ తెలిపాడు. 

ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో ధోనీ ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలుపొంది కేవలం రాంచీ వేదికగా జరిగిన ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. అప్పటికే 2-1ఆధిక్యంతో కొనసాగుతున్న టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ పరాజయం పొందడంతో ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ముందు భారత బౌలర్లు సైతం వణికిపోయారు. 
Read Also : నువ్వు తోపు బాసూ : 2020 వరకు రవిశాస్త్రినే