ధోనీ వార్నింగ్: సవాళ్లకు సమాధానం చెప్తాం

ధోనీ వార్నింగ్: సవాళ్లకు సమాధానం చెప్తాం

ధోనీ వార్నింగ్: సవాళ్లకు సమాధానం చెప్తాం

ఐపీఎల్ ప్రచారం పీక్స్‌కు చేరుకుంది. ప్రతి ఫ్రాంచైజీ తమ తడాఖా చూపిస్తామంటూ చాలెంజ్‌లు విసురుతున్నాయి. రెండేళ్లపాటు నిషేదానికి గురై 2018సీజన్‌లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది. మరోసారి ఐపీఎల్ కు సిద్ధమవుతూ గట్టి పట్టుదలతో కనిపిస్తోంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తడాఖా చూపిస్తామంటూ సవాల్ విసురుతున్నాడు. 

ప్రచారంలో భాగంగా చేసిన వీడియోలో ధోనీ మాట్లాడుతూ.. ‘కొన్నేళ్ల క్రితం నా మీద నా జట్టు మీద విమర్శలు వచ్చాయి. వాటికి సమాధానం తప్పక చెబుతాం. ఏం చేద్దాం. లక్ష్యం ముందుంది కదా. చేసి చూపిద్దాం’ అని సవాల్ విసిరాడు. ఈ చాలెంజ్‌ను హాట్ స్టార్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా పోస్టు చేసింది. 

ఇంతకుముందు మరో వీడియోలో ధోనీ విమర్శలకు బదులిచ్చి తీరతామనే ధీమా వ్యక్తం చేశాడు. దీనిని బట్టి చూస్తే ఈ సీజన్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ సత్తా చాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సూపర్ కింగ్స్ లీగ్ లోని తొలి మ్యాచ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మార్చి 23న చెన్నై వేదికగా ఆడనుంది.

×