MS Dhoni: నెక్ట్స్ మ్యాచ్‌లో ధోని డౌటే.. వచ్చే రెండుమూడు మ్యాచ్‌లకు విశ్రాంతి తప్పనిసరా?

ఐపీఎల్ ప్రారంభం నుంచి మహేందర్ సింగ్ ధోని మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో మ్యాచ్ సమయంలో ఆ గాయం ధోనిని ఇబ్బంది పెట్టినట్లు కనిపించింది. ప్రస్తుతం ధోనికి 41ఏళ్లు.

MS Dhoni: నెక్ట్స్ మ్యాచ్‌లో ధోని డౌటే.. వచ్చే రెండుమూడు మ్యాచ్‌లకు విశ్రాంతి తప్పనిసరా?

MS Dhoni

MS Dhoni: ఐపీఎల్ – 2023 సీజన్ మ్యాచ్ లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఒకరుకుమించి ఒకరు నువ్వానేనా అన్నట్లు బౌలింగ్, బ్యాటింగ్‍‌లో పోటీ పడుతున్నారు. చివరి వరకు మ్యాచ్ లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. బుధవారం రాత్రి జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో చివరి బంతికి ధోనీ సేన ఓటమి పాలైంది. చివరి బంతికి ఐదు పరుగులు కొట్టాల్సి ఉండగా.. క్రీజులో ఉన్న ధోని సిక్స్ కొట్టడంలో విఫలమయ్యాడు. చివరి బాల్‌కు ఆర్‌ఆర్ జట్టు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ధోని మోకాలి నొప్పితో ఇబ్బంది పడ్డాడు. కీపింగ్ చేసే సమయంలో, బ్యాటింగ్ చేసే సమయంలో నొప్పితో కొంచెం ఇబ్బంది పడినట్లు కనిపించింది.

MS Dhoni: ధోని ఆడింది 17 బంతులే.. జియో వ్యూస్ మాత్రం రెండున్నర కోట్లు

ఐపీఎల్ ప్రారంభం నుంచి మహేందర్ సింగ్ ధోని మోకాలి  గాయంతో బాధపడుతున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో మ్యాచ్ సమయంలో ఆ గాయం ధోనిని ఇబ్బంది పెట్టినట్లు కనిపించింది. ప్రస్తుతం ధోనికి 41ఏళ్లు. ఐపీఎల్ నుంచిసైతం ధోనీ తప్పుకోవాలని అనుకున్నాడు. కానీ, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ధోని గాయం కారణంగా వచ్చే మ్యాచ్‌లో ఆడేది అనుమానంగానే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ -2023 సీజన్ లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడింది. రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో నిలిచింది. సీఎస్‌కే జట్టు తదుపరి మ్యాచ్ ఈ‌నెల 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. అయితే, ధోని మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న కారణంగా ఆ మ్యాచ్ లో ఆడే అవకాశాలు తక్కువని తెలుస్తోంది. వచ్చే రెండుమూడు మ్యాచ్ ల వరకు ధోని విశ్రాంతి తీసుకుంటాడన్న వార్తలుకూడా వస్తున్నాయి.

MS Dhoni Warning : అలా అయితే కెప్టెన్సీ వదిలేస్తా.. సీఎస్‌కే బౌలర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్

ధోని మోకాలి గాయంపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించారు. ధోని గాయం పెద్దదేమీ కాదని, అతను కోలుకొని జట్టును నడిపించగలడనే విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేయర్లు గాయాల భారినపడుతున్నారు. ఇప్ప‌టికే దీప‌క్ చాహ‌ర్‌, ఆల్ రౌండ‌ర్ బెన్‌స్టోక్స్‌ల‌తో పాటు సిమ్ర‌న్‌జీత్ సింగ్‌, ముకేశ్ చౌద‌రీ‌లు గాయ‌ప‌డ‌డంతో ఇప్ప‌టికే వీరి సేవ‌ల‌ను చెన్నై కోల్పోయింది. తాజాగా పేసర్ సిసాండా మ‌గాలా చేతికి గాయ‌ం కావడంతో రెండు వారాలు టోర్నీకి దూరమయ్యాడు. ప్రస్తుతం ధోని కూడా మోకాలి గాయంతో బాధ‌ప‌డుతుండ‌డంతో పాటు వచ్చే రెండుమూడు మ్యాచ్ లకు ఆడే అవకాశాలు తక్కువ ఉండటం సీఎస్‌కే జట్టుకు గట్టిదెబ్బేనని చెప్పొచ్చు.