#15YearsOfDhonism….విధ్వంసం మొదలై 15ఏళ్లు

  • Published By: venkaiahnaidu ,Published On : December 22, 2019 / 03:36 PM IST
#15YearsOfDhonism….విధ్వంసం మొదలై 15ఏళ్లు

మహేంద్ర సింగ్ ధోనీ…క్రీడాభిమానులకు ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన విధ్వంసకర బ్యాటింగ్,అధ్భుతమైన నాయకత్వ లక్షణాలతో టీమిండియాను ముందుకుతీసుకెళ్లిన విధానంతో క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తిగా నిలిచాడు ఈ జార్ఖండ్ డైనమైట్. అయితే పొడవైన జుట్టు,ముఖంలో నవ్వు,వినయంగా కన్పించే మహీంద్ర సింగ్ ధోనీ అనే యువకుడు అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టి సోమవారం(డిసెంబర్-22,2019)నాటికి 15ఏళ్లు.  

డిసెంబర్-23,2004న ప్రారంభమైన భారత్-బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్ లో తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్ లో మహీ అడుగుపెట్టాడు. అయితే మొదటి మ్యాచ్ లో డకౌట్ అయిన ధోనీ ఆ తర్వాత..తర్వాత క్రికెట్ అభిమానుల గుండెల్లో దేవుడిగా స్థిరపడిపోయే స్థాయికి ఎదిగిపోయాడు. గ్రౌండ్ లోకి ధోనీ అడుగుపెడితే చాలు అని క్రికెట్ అభిమానులు టీవీల ముందు కూర్చొని ప్రార్థనలు చేసేవారంటే ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

అయితే ధోనీ అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టి మరికొన్ని గంటల్లలో 15ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆదివారం(డిసెంబర్-22,2019)నుంచి సోషల్ మీడియాలో ధోనీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ధోనీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. 15ఇయర్స్ ఆఫ్ ధోనీఇజమ్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.ట్