క్యాచ్ వదిలేస్తావా: మిస్టర్ కూల్‌కి కోపం వచ్చింది

క్యాచ్ వదిలేస్తావా: మిస్టర్ కూల్‌కి కోపం వచ్చింది

సీజన్ మొత్తంలో అందరికంటే ముందుగా ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిపోయి పరాజయాన్ని మూటగట్టుకుంది. 6వికెట్ల తేడాతో ఓడిపోవడంతో ఫైనల్ వెళ్లే అవకాశాన్ని మరింత దూరం చేసుకుంది. 

మైదానంలో, మీడియా సమావేశంలో ఎప్పుడూ కూల్‌గా కనిపించే ధోనీ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆవేశాన్ని ప్రదర్శించాడు. మురళీ విజయ్ క్యాచ్ చేజార్చడంతో కాసేపటి వరకూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసి 132పరుగుల టార్గెట్‌ను నిర్దేశించిన చెన్నై కాపాడుకోలేకపోయింది. అదే క్రమంలో చేధనకు దిగిన ముంబైను కట్టడి చేయలేకపోయింది. బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ పొరబాట్లు దొర్లడంతో మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు.

సూర్యకుమార్ యాదవ్ వీరోచిత పోరాటానికి బ్రేక్ వేసేందుకు వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా చెన్నై చేజార్చుకోవడంతో ధోనీ కోపం కట్టలు తెంచుకుంది. 4.4ఓవర్లో చాహర్ వేసిన బంతిని భారీ షాట్‌కు యత్నించాడు సూర్యకుమార్. కాస్త తడబాటుకు గురైన మురళీ విజయ్ క్యాచ్ చేజార్చుకున్నాడు. ఈ వీడియో నెట్టింట్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది.