గెలిచామంటే ఇమ్రాన్‌ను ఆపడం ఎవ్వరితరం కాదు

గెలిచామంటే ఇమ్రాన్‌ను ఆపడం ఎవ్వరితరం కాదు

చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్న మ్యాచ్‌లో అవతలి జట్టు బ్యాట్స్‌మన్ అవుట్ అని అంపైర్ వేలెత్తడం చాలు.. ఇమ్రాన్ తాహిర్ సంబరాలకు అవధులు ఉండవు. మైదానం ఒక చివరి నుంచి మొదలుపెట్టి మరో వైపుకు పరుగెడుతూనే ఉంటాడు. కొన్ని సార్లు చాతిపై గుద్దుకుంటూ సింహంలా గర్జిస్తుంటాడు. అతని సెలబ్రేషన్‌ను పంచుకోవడంతో పాటు ఆపడానికి ఎవ్వరూ సాహసం చేయరు. 

40ఏళ్ల ఈ దక్షిణాఫ్రికా లెగ్ స్పిన్నర్ మ్యాచ్ అడుగుపెట్టిన ప్రతిసారి కొత్త ఎనర్జీతో మొదలుపెడతాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే తాహిర్‌కు పరాశక్తి ఎక్స్‌ప్రెస్ అనే నిక్ నేమ్ కూడా పెట్టేశారు. మ్యాచ్ పూర్తి అయినా సరే.. ప్రత్యర్థి జట్టును విష్ చేసి మైదానం నుంచి పంపించాలనుకోడు. మైదానం మొత్తం గింగిరాలు తిరుగుతూ.. వరల్డ్ క్రికెట్‌లో బెస్ట్ వికెట్ తీసినట్లుగా ఫీలవుతాడు. 

దీనిపై స్పందించిన ధోనీ.. ‘నాకు వాట్సన్‌కు 100% ఫిట్‌గా లేనప్పుడు తాహిర్‌ను ఆపే ప్రయత్నం చేయడమెందుకు. అతను చేసే మంచి పనేంటంటే ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడికే వచ్చి ఆపేస్తాడు. అప్పుడు చెప్తాం. అవును బాగా చేశావు. చక్కగా బౌలింగ్ చేశావని ఆ తర్వాత మళ్లీ ఫీల్డింగ్ పొజిషన్‌కి వెళ్లిపోతాం’ అని ధోనీ నవ్వుతూ తాహిర్‌పై జోక్ చేశాడు.