Captain Cool MS Dhoni: క్రికెట్‌లో ధోని విజయాలు..

Captain Cool MS Dhoni: క్రికెట్‌లో ధోని విజయాలు..

Dhoni

Happy Birthday MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనిఈరోజు(7-7-2021) తన 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కెప్టెన్ మిస్టర్ కూల్. తన పుట్టినరోజు సంధర్భంగా ధోని సాధించిన కొన్ని విజయాలు గురించి ప్రస్తావించాల్సిందే.

మూడు అతిపెద్ద ట్రోఫీలు ధోని కెప్టెన్సీలోనే:
ధోని సారధిగా ICCకి చెందిన మూడు అతిపెద్ద ట్రోఫీలను కైవసం చేసుకున్నారు. ఇందులో 2007 ప్రపంచ టీ20 ఒకటి, రెండవది 2011 ప్రపంచ కప్, మూడవది 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్నాయి. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియాను అగ్రస్థానానికి తీసుకెళ్లిన కెప్టెన్ ధోని.

కెప్టెన్‌గా ఎక్కువ అంత‌ర్జాతీయ మ్యాచులు ఆడిన క్రికెట‌ర్:
ఎంఎస్ ధోని త‌న క్రికెట్ కెరీర్‌లో అన్ని ఫార్మ‌ట్ల‌లో కెప్టెన్‌గా 332 అంత‌ర్జాతీయ మ్యాచులను నడిపించాడు. అందులో 178సార్లు భార‌త్ విజ‌యం సాధించగా.. ఎక్కువ స్టంపౌట్లు చేసిన కీప‌ర్ కూడా ధోనినే. మూడు ఫార్మాట్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు 538 మ్యాచుల్లో 195స్టంపౌట్లు చేశాడు.

వికెట్ కీపర్‌గా మోస్ట్ సక్సెస్‌ఫుల్:
ధోని 500 మ్యాచ్‌ల్లో 780 మంది ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపిన మూడవ అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్. ఇందులో మొదటి స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్, రెండో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఉన్నారు.

దాయాదులపై వన్డే, టెస్ట్ సెంచరీ:
ఎంఎస్ ధోని భారత చిరకాల ప్రత్యర్థులు, దాయాది పాకిస్తాన్‌పై తొలి వన్డే సెంచెరీ, టెస్ట్ సెంచరీని కొట్టాడు. విశాఖలో పాకిస్తాన్‌పై 148పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ధోని కెరీర్‌తో ఫస్ట్ సెంచరీ రికార్డు.

బెస్ట్ ఫినిషర్ ధోనినే:
టీమిండియా బెస్ట్ ఫినిషర్ మహేంద్రసింగ్ ధోనినే.. మొత్తం 13సార్లు సిక్సర్‌తో ముగించాడు ధోని. వన్డేల్లో మొత్తం 217 సిక్సర్లు కొట్టాడు. ఈ లిస్ట్‌లో ధోని నాలుగో స్థానంలో ఉన్నాడు. కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ధోని పేరిటే ఉంది. అర్ధ సెంచరీ కొట్టకుండా అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా ధోని పేరిటే ఉంది. అర్ధ సెంచరీ చేయకుండా వెయ్యి పరుగులు చేసిన ఆటగాడు ధోని.

ICC ODI ప్లేయర్ ఆఫ్ ది ఇయర్:
2004లో వ‌న్డే క్రికెట్‌లోకి అడుగు పెట్టిన ధోని, కేవ‌లం 15 నెల‌ల్లోనే ఐసీసీ వ‌న్డే ఇంట‌ర్నేష‌న‌ల్ ర్యాంకింగ్స్‌లో నెంబ‌ర్ 1 అయ్యాడు. వరుసగా రెండుసార్లు ఐసీసీ వన్డే క్రికెటర్‌గా ఎంపికైన తొలి ఆటగాడు ధోనినే. 2008, 2009 సంవత్సరాలలో ధోని వరుసగా ICC ODI ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. ఏడవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ధోని అత్యధిక సెంచరీలు చేశాడు. ఈ ఆర్డర్‌పై బ్యాటింగ్ చేసిన ధోని పేరు మీద రెండు సెంచరీలు ఉన్నాయి.

నాటౌట్ రికార్డ్.. బౌలర్‌గా కూడా:
అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ధోని మూడు ఫార్మాట్ల‌లో క‌లిపి 142 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఇక కీపర్ బౌలర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశం తక్కువ కానీ, ధోని 2009లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేసి వికెట్ కూడా తీశాడు. మొత్తం 9 సార్లు ధోని బౌలింగ్ చేశాడు.