భజ్జీ.. తాహిర్‌లు వైన్ లాంటి వాళ్లు: ధోనీ

వరుస విజయాలతో దూసుకెళ్తోన్న చెన్నై సూపర్ కింగ్స్‌లో ఇమ్రాన్ తాహిర్, హర్భజన్ సింగ్‌లు మంచి సహకారాన్ని అందిస్తున్నారు.

భజ్జీ.. తాహిర్‌లు వైన్ లాంటి వాళ్లు: ధోనీ

వరుస విజయాలతో దూసుకెళ్తోన్న చెన్నై సూపర్ కింగ్స్‌లో ఇమ్రాన్ తాహిర్, హర్భజన్ సింగ్‌లు మంచి సహకారాన్ని అందిస్తున్నారు.

వరుస విజయాలతో దూసుకెళ్తోన్న చెన్నై సూపర్ కింగ్స్‌లో ఇమ్రాన్ తాహిర్, హర్భజన్ సింగ్‌లు మంచి సహకారాన్ని అందిస్తున్నారు. వయస్సు పెరుగుతున్నా.. ఫామ్ కోల్పోని ఆ  జోడీని చూస్తే వైన్‌లా అనిపిస్తోందని సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. కాలం పెరుగుతోన్న కొద్దీ వైన్‌లో ఎఫెక్ట్ పెరిగినట్లు వయస్సుతో పాటు మెచ్యూరిటీగా ఆడుతున్నారని కొనియాడాడు. 

‘చెన్నైకు చాలా కాలం నుంచి ఆడుతున్నాను. టెస్టు అరంగ్రేటం నుంచి ఇక్కడ నాకు చాలా మంచి విషయాలు కలిసొస్తున్నాయి. ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నా. బ్రావోను దూరంగా ఉంచడం కొంచెం కష్టంగానే ఉంది. డేవిడ్ కూడా రెడీగా లేడు’

‘భజ్జీ.. తాహిర్‌లు వయస్సు పక్కనపెట్టేశారు. వైన్‌లా వయస్సు పెరుగుతున్న కొద్దీ వారు మెచ్యూర్ అవుతున్నారు. ఆడిన ప్రతి గేమ్ లోనూ మెరుగు చూపిస్తున్నాడు. అవసరమైన ప్రతిసారి తాహిర్ సత్తా చాటుతున్నాడు. ఫ్లాట్ వికెట్లు, చిన్న బౌండరీల మీద ప్రయోగించిన కాంబినేషన్‌లు మిగతా గేమ్‌లలోనూ వాడాలనుకుంటున్నాం’ అని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. 

ఐపీఎల్ 2019లో 6 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే 5 మ్యాచ్‌లు గెలిచి లీగ్ లో టాప్ స్థానంలో కొనసాగుతోంది. కేవలం ఒక్క 4వ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. 
Read Also : మలింగ మళ్లీ వచ్చాడు.. ప్రతీకారం తీర్చుకోవలసిందే..