MS Dhoni: రాంచీలో టీమిండియా సభ్యులతో ఎంఎస్ ధోని.. వీడియో వైరల్..

బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసిన వీడియోలో ధోని కొబ్బరి బోండా తాగుతూ టీం సభ్యులతో ముచ్చటిస్తున్నారు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, తదితర టీం సభ్యులు ధోనితో సంభాషిస్తున్నారు.

MS Dhoni: రాంచీలో టీమిండియా సభ్యులతో ఎంఎస్ ధోని.. వీడియో వైరల్..

MS Dohni

MS Dhoni: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ శుక్రవారం రాత్రి  జరుగుతుంది. రాంచీలో జరిగే తొలి మ్యాచ్‌కోసం హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా జట్టు రెండురోజులుగా ప్రాక్టీస్ చేస్తోంది. జేఎస్‌సీఏ స్టేడియంలోని డ్రస్సింగ్ రూంలోఉన్న హార్ధిక్, టీం సభ్యుల వద్దకు భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆకస్మికంగా వెళ్లి సర్ఫ్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

India vs Newzeland: కుప్పకూలిన న్యూజిలాండ్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే ఆలౌట్

బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో ధోని కొబ్బరి బోండా తాగుతూ టీం సభ్యులతో ముచ్చటిస్తున్నట్లు కనిపించింది. హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, తదితర టీం సభ్యులు ధోనితో మాట్లాడుతున్నారు. అంతేకాక భారత్ ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ తో సహా జట్టు సిబ్బందిని ధోనీ కలిశారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆగస్టు 2020లో ధోనీ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమిలియర్ లీగ్ 2023 ఎడిషన్ లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. చెన్నై జట్టుకు ధోనీ కెప్టెన్ గా వ్యవహరిస్తారు.

 

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ లు పూర్తయ్యాయి. వన్డే ఫార్మాట్ లో క్లీన్ స్వీప్ చేసిన భారత్ జట్టు టీ20కి సన్నద్ధమవుతోంది. అయితే, టీ20 సిరీస్ లో రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లు లేరు. హార్ధిక్ సారథ్యంలో యువ జట్టు కివీస్ ను ఢీకొట్టబోతుంది. తొలి మ్యాచ్ రేపు రాంచీలో జరుగుతుంది.