దటీజ్ ధోనీ: ‘హ్యాట్రిక్‌’ చెన్నై!

  • Published By: vamsi ,Published On : April 1, 2019 / 01:18 AM IST
దటీజ్ ధోనీ: ‘హ్యాట్రిక్‌’ చెన్నై!

మహేంద్ర సింగ్ ధోనీ… ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. ధోనీ పని అయిపోయింది అని అన్నప్పుడల్లా ఒక మెరుపులా మెరిసి తను ఆడే జట్టును విజయ తీరాలకు చేర్చి ఒక కొత్త చరిత్రను రాస్తాడు. అది ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు అయినా ఐపీఎల్ పోరు అయినా ఒంటరి పోరాటం చేయడంలో మేటి అతడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో జట్టును చూస్తే హేమాహేమీలు ఎవ్వరూ లేరు. జట్టు బలం తక్కువే అయినా మెస్మరైటజ్ చేసింది. రాజస్థాన్ రాయల్స్‌పై ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించింది. 

ఐపీఎల్‌ 12వ సీజన్‌లో భాగంగా వరుసగా మూడో(హ్యాట్రిక్) విజయం అందుకుంది. ఆదివారం జరిగిన పోరులో సూపర్‌ కింగ్స్‌ 8 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌పై గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 27పరుగులకే 3వికెట్లు పడిన తరుణంలో ధోనీ(75) వీరోచిత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను నిలబెట్టాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌ మొదట్లోనే వరుస వికెట్లు కోల్పోయింది. 14పరుగులకే 3వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రాహుల్‌ త్రిపాఠి, స్టీవ్‌ స్మిత్‌ జాగ్రత్తగా ఆడడంతో కొంచెం నిలదొక్కుకున్నట్లు కనిపించింది. అయితే 75 పరుగుల వద్ద నాలుగో వికెట్‌‌ను కోల్పోయి రాయల్స్ మళ్లీ కష్టాల్లో పడింది. చివరి ఓవర్లో 12 పరుగులు చేయాల్సివుండగా బ్రేవో బౌలింగ్‌లో స్టోక్స్‌ అవుట్ అవడంతో జట్టు ఓడిపోయింది.

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: 
రాయుడు (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 1;
వాట్సన్‌ (సి) ఆర్చర్‌ (బి) స్టోక్స్‌ 13;
రైనా (బి) ఉనద్కత్‌ 36;
జాదవ్‌ (సి) బట్లర్‌ (బి) ధవళ్‌ 8; 
ధోని నాటౌట్‌ 75; 
బ్రావో (సి) ధవళ్‌ (బి) ఆర్చర్‌ 27;
జడేజా నాటౌట్‌ 8; 
ఎక్స్‌ట్రాలు 7 
మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 175; 
వికెట్ల పతనం: 1-1, 2-14, 3-27, 4-88, 5-114; 
బౌలింగ్‌: ధవళ్‌ కులకర్ణి 4-0-37-1; ఆర్చర్‌ 4-1-17-2; స్టోక్స్‌ 3-0-23-0; శ్రేయస్‌ గోపాల్‌ 3-0-23-0; కె.గౌతమ్‌ 2-0-13-0; 4-0-54-1 

రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌:
రహానె (సి) జడేజా (బి) చాహర్‌ 0; 
బట్లర్‌ (సి) బ్రావో (బి) ఠాకూర్‌ 6; 
శాంసన్‌ (సి) రైనా (బి) చాహర్‌ 8;
త్రిపాఠి (సి) అండ్‌ (బి) తాహిర్‌ 39;
స్టీవ్‌ స్మిత్‌ (సి) షోరె (బి) తాహిర్‌ 28;
స్టోక్స్‌ (సి) రైనా (బి) బ్రావో 46;
గౌతమ్‌ (సి) రైనా (బి) ఠాకూర్‌ 9;
ఆర్చర్‌ నాటౌట్‌ 24;
గోపాల్‌ (సి) తాహిర్‌ (బి) బ్రావో 0;
ఉనద్కత్‌ నాటౌట్‌ 0;
ఎక్స్‌ట్రాలు 7; 
మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 167; 
వికెట్ల పతనం: 1-0, 2-14, 3-14, 4-75, 5-94, 6-120, 7-164, 8-166; 
బౌలింగ్‌: చాహర్‌ 4-1-19-2; శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-42-2; శాంట్నర్‌ 2-0-26-0; జడేజా 2-0-23-0; తాహిర్‌ 4-0-23-2; బ్రావో 4-0-32-2