ఎమ్మెస్కే ఇక తప్పుకోవాల్సిందే… : గంగూలీ

10TV Telugu News

గంగూలీ చెప్పకనే చెప్పాడు.. ఎమ్మెస్కే పదవి నుంచి తప్పుకుంటాడని. మరోవైపు వరల్డ్ కప్ టోర్నీతోనే పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎమ్మెస్కే ప్రసాద్.. పదవిని మరో ఆరు నెలల పాటు పొడిగించారు. ఇటీవల టీమిండియా సెలక్షన్‌లో తప్పులు దొర్లుతున్నాయని వెటరన్ క్రికెటర్ భజ్జీ లాంటి వాళ్లు చేసిన కామెంట్లపై గంగూలీ స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా ఆడిన అనుభవం లేని ఎమ్మెస్కేను రీ ప్లేస్ చేసేట్లుగా మాట్లాడాడు. 

ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా సీఏసీ ఆధ్వర్యంలో కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పాటు అవుతుంది. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్లలో ఒకరైన గగన్ ఖోడాలకు రీప్లేస్‌మెంట్ తీసుకుంటాం. దీనిని త్వరలోనే ప్రకటిస్తాం. ‘రెండు మూడు రోజుల్లోగా సీఏసీ పేర్లను సూచిస్తుంది. ప్లేయర్లను సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటాం’ అని సీఏసీ తెలిపింది. 

గంగూలీ నాలుగు దేశాల టోర్నమెంట్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ‘ఇది కేవలం ప్రపోజల్ మాత్రమే. చూద్దాం ఏది ఎటు వెళ్తుందో.. మంచి పోటీతో కూడిన వాతావరణం ఉండాలని అనుకుంటున్నా. బ్రాడ్‌కాస్టర్లు, ఐసీసీ నుంచి నాలుగు దేశాల టోర్నమెంట్ కు క్లియరెన్స్ రావాలి. క్వాలిటీ క్రికెట్ కోసమే ఈ కష్టమంతా. ఈ రోజుల్లో కేవలం ద్వైపాక్షిక క్రికెట్ మాత్రమే కనిపిస్తుంది. హై క్లాస్ టోర్నమెంట్ కోసం వేచి చూస్తున్నారు. 

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ల మధ్యా జరిగే బాక్సింగ్ డే టెస్టులాంటివి కోరుకుంటున్నారు. ఇది కూడా ఓ కారణం. పింక్ బాల్ టెస్టు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఓ రకంగా ఉపయోగపడింది’అని గంగూలీ చెప్పాడు. 

×