MI vs DC IPL 2020: ఢిల్లీపై ముంబై ఇండియన్స్ విజయం

  • Published By: vamsi ,Published On : October 11, 2020 / 07:38 PM IST
MI vs DC IPL 2020: ఢిల్లీపై ముంబై ఇండియన్స్ విజయం

[svt-event title=”ముంబైదే విజయం” date=”11/10/2020,11:01PM” class=”svt-cd-green” ] ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ 27 వ మ్యాచ్‌లో ఢిల్లీపై ముంబై ఇండియన్స్ 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. [/svt-event]

[svt-event title=”రాణించిన గబ్బర్.. ఢిల్లీ స్కోరు 162/4″ date=”11/10/2020,9:23PM” class=”svt-cd-green” ] ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా ముంబైపై తన మునుపటి ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో 4 పరుగుల వద్ద క్రునాల్ పాండ్యా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 15 బంతుల్లో 15 పరుగులు చేసి అజింక్య రహానే కూడా రెండవ వికెట్‌గా అవుట్ అయ్యాడు.

ఐపిఎల్ 2020‌లో రహానేకు ఇది తొలి మ్యాచ్‌ కాగా.. ఆశించిన స్థాయిలో రాణించలేదు. శిఖర్ ధావన్‌తో మంచి భాగస్వామ్యాన్ని పంచుకున్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. మూడవ వికెట్‌గా అవుట్ అయ్యాడు. శిఖర్ ధావన్ 39 బంతుల్లో అర్ధ సెంచరీ కొట్టాడు. 8 బంతుల్లో 13 పరుగులు చేసి రనౌట్ అయిన మార్కస్ స్టోయినిస్.. ఢిల్లీకి నాలుగో వికెట్. ధావన్ 69, అలెక్స్ క్యారీ 14 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి.. రిషబ్ పంత్ స్థానంలో అలెక్స్ క్యారీని చేర్చారు, కాని విదేశీ ఆటగాడు కావడంతో, షిమ్రాన్ హెట్మీయర్‌ను తొలగించాల్సి వచ్చింది. ఐపిఎల్ 2020లో అజింక్య రహానెకు మొదటి అవకాశం లభించింది. [/svt-event]

[svt-event title=”ముంబై టార్గెట్ 163″ date=”11/10/2020,9:15PM” class=”svt-cd-green” ] టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ధావన్‌ (69*), శ్రేయస్ అయ్యర్‌ (42) రాణించగా.. ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు చేసింది. దీంతో ముంబై టార్గెట్ 163గా ఫిక్స్ అయ్యింది. [/svt-event]

[svt-event title=”జట్ల వివరాలు:” date=”11/10/2020,7:45PM” class=”svt-cd-green” ]

Mumbai Indians (Playing XI): రోహిత్ శర్మ (C), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

Delhi Capitals (Playing XI): పృథ్వీ షా, శిఖర్ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్), రహానె, స్టాయినిస్‌, అలెక్స్‌ క్యారీ‌, హర్షల్ పటేల్, ఆర్‌ అశ్విన్‌, రబాడ, నోర్జె [/svt-event]

[svt-event title=”హోరాహోరీ పోరు:” date=”11/10/2020,7:33PM” class=”svt-cd-green” ] ఐపిఎల్ 2020 సీజన్లో రెండు బలమైన జట్ల మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు అబుదాబిలో తలపడుతున్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు మంచి ప్రదర్శన కనబరచగా.. ఈ సీజన్‌లో ఢిల్లీ 6 మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక మ్యాచ్‌లోనే ఓడిపోయింది.

మరోవైపు, రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై కూడా బలమైన జట్టుగా ఆడుతుంది. ముంబై 6 మ్యాచ్‌ల్లో 4 గెలవగా.. 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ క్రమంలో రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది.

6 మ్యాచ్‌ల్లో అయిదు విజయాలతో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా, నాలుగు విజయాలతో ముంబయి రెండో స్థానంలో ఉంది. అన్ని విభాగాల్లో ఎంతో పటిష్ఠంగా ఉన్న ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. [/svt-event]