Rishabh Pant: రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ ఎంచుకోవడానికి కారణం.. తండ్రే

ఐపీఎల్ సంరంభం ముగిసిందో లేదో.. టీమిండియా యాక్షన్ తో రెడీ అయ్యాడు రిషబ్ పంత్. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో టీ20సిరీస్ కు రెడీ అవుతున్నాడు. టీంలో వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఉన్నప్పటికీ పంత్ చోటు మాత్రం పక్కాగా ఉంది.

Rishabh Pant: రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ ఎంచుకోవడానికి కారణం.. తండ్రే

Rishab Pant

Rishabh Pant: ఐపీఎల్ సంరంభం ముగిసిందో లేదో.. టీమిండియా యాక్షన్ తో రెడీ అయ్యాడు రిషబ్ పంత్. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో టీ20సిరీస్ కు రెడీ అవుతున్నాడు. టీంలో వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఉన్నప్పటికీ పంత్ చోటు మాత్రం పక్కాగా ఉంది. విమర్శలను ఎదుర్కొంటూ వికెట్ కీపింగ్, బ్యాటింగ్ లో ఉత్తమ ప్రదర్శనలు సాధించడంతోనే ఇది సాధ్యమైంది.

ప్రతి ఆటలో నైపుణ్యాన్ని పెంచుకుంటూ పోతున్న పంత్.. ఇంటర్నేషనల్ క్రికెట్ లో సత్తా చాటుతున్నాడు. అసలు తాను వికెట్ కీపింగ్ ఎలా ఎంచుకున్నాడో.. ఎక్కడ నేర్చుకున్నాడో రీసెంట్ గా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు పంత్.

“ప్రతి ఆటలో నా నుంచి వంద శాతం ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలనే అనుకుంటాను. నేనెప్పుడూ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌నే. చిన్నప్పుడు వికెట్ కీపింగ్ నేర్చుకుంటున్న సమయంలో మా నాన్న కూడా వికెట్ కీపింగ్ చేసేవారు. అలా వికెట్ కీపింగ్ నేర్చుకున్నా” అని వివరించాడు.

Read Also: “ఆ మ్యాచ్‌లు ఆడకపోతే పంత్‌ను పట్టించుకోరు”

రీసెంట్ గా ముగిసిన ఐపీఎల్ లో రిషబ్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ వరకూ చేరుకుంది. రాబోయే టీమిండియా టీ20 ఇంటర్నేషల్ సిరీస్ కు పంత్ ను వైస్ కెప్టెన్ నియమించింది సెలక్షన్ కమిటీ. రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోనుండటంతో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఈ సిరీస్ జరగనుంది.