Naveen Ul Haq: విరాట్ కోహ్లికి సారీ చెప్పిన న‌వీన్ ఉల్ హ‌క్‌.. నిజ‌మెంత‌..?

విరాట్ కోహ్లీ అభిమానుల‌కు న‌వీన్ ఉల్ హ‌క్ క్షమాప‌ణ‌లు చెప్పాడట‌. విరాట్ కోహ్లితో గొడ‌వ పెట్టుకోవ‌డం త‌న జీవితంలో చేసిన అతి పెద్ద త‌ప్పు అని, పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ కంటే కోహ్లి ఎంతో గొప్ప‌వాడ‌ని ఇలా వ‌రుస ట్వీట్ల‌ను న‌వీన్ ఉల్ హ‌క్ చేసిన‌ట్లుగా ఉన్నాయి.

Naveen Ul Haq: విరాట్ కోహ్లికి సారీ చెప్పిన న‌వీన్ ఉల్ హ‌క్‌.. నిజ‌మెంత‌..?

Naveen Ul Haq-Virat Kohli

Naveen Ul Haq Apologise To Virat Kohli: నవీన్‌ ఉల్‌ హక్(Naveen Ul Haq ).. ప్ర‌స్తుతం ఈ పేరు తెలియ‌ని క్రికెట్ అభిమానులు ఉండ‌రు. కింగ్ కోహ్లి(Virat Kohli)తో గొడ‌వ‌కు ముందు ఎవ్వ‌రికి ఇత‌ను పెద్ద‌గా తెలియ‌దు. అయితే.. ఎప్పుడైతే విరాట్‌తో గొడ‌వ పెట్టుకున్నాడో అప్ప‌టి నుంచి ఈ అఫ్గానిస్థాన్ బౌల‌ర్ నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఐపీఎల్‌(IPL)లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌(Lucknow Super Giants)కు ఆడుతున్న ఈ బౌల‌ర్ ముంబై ఇండియ‌న్స్‌(Mumbai Indians)తో మ్యాచ్ అనంత‌రం మ‌రోసారి ట్రోల్స్ బారిన ప‌డ్డాడు. ఈ మ్యాచ్‌లో అత‌డు నాలుగు వికెట్లు తీసిన‌ప్ప‌టికి ఓడిపోవ‌డంతో ఈ సీజ‌న్ నుంచి ల‌క్నో నిష్క్ర‌మించింది.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం కొన్ని ట్వీట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఆ ట్వీట్ల సారాంశం ఏమిటంటే.. విరాట్ కోహ్లీ అభిమానుల‌కు న‌వీన్ ఉల్ హ‌క్ క్షమాప‌ణ‌లు చెప్పాడట‌. విరాట్ కోహ్లితో గొడ‌వ పెట్టుకోవ‌డం త‌న జీవితంలో చేసిన అతి పెద్ద త‌ప్పు అని, పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ కంటే కోహ్లి ఎంతో గొప్ప‌వాడ‌ని ఇలా వ‌రుస ట్వీట్ల‌ను న‌వీన్ ఉల్ హ‌క్ చేసిన‌ట్లుగా ఉన్నాయి.

IPL 2023: గౌతం గంభీర్‌ను పొగుడుతూ కోహ్లీ ఫ్యాన్స్‌కి మళ్లీ చిరాకు తెప్పించిన నవీన్ ఉల్ హక్

ఇన్ని రోజులు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌ని వాడు స‌డెన్‌గా చెప్ప‌డం ఏమిటి..? అత‌డు చేసిన త‌ప్పులు తెలుసుకుంటే మంచిదే. అందుకు ఎవ్వ‌రు ఏమీ అన‌డం లేదు గానీ నిజంగానే న‌వీన్ ఉల్ హ‌ల్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాడా..? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. దీంతో కాస్త లోతుగా ప‌రిశీలించ‌గా అది ఫేక్ అకౌంట్ అని తేలింది. దీనిని విరాట్ కోహ్లి ఫాన్స్ ఒక‌రు ఆప‌రేట్ చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

గంభీర్‌ను పొగుడుతూ..

ఈ సీజ‌న్ నుంచి ల‌క్నో నిష్క్ర‌మించిన అనంత‌రం న‌వీన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ల‌క్నో మెంటార్ గౌత‌మ్ గౌంభీర్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. గంభీర్‌కు భార‌త దేశంలో చాలా గౌర‌వం ఉంది. భార‌త క్రికెట్‌కు ఆయ‌న ఎంతో మంచి చేశాడు. కోచ్‌గా మెంటార్‌గా క్రికెట్ లెజెండ్‌గా ఆయ‌న‌కు నేను చాలా గౌర‌వం ఇస్తాను. ఆయ‌న నుంచి చాలా నేర్చుకున్నాను అని న‌వీన్ ఉల్ హ‌క్ అన్నాడు. ఐపీఎల్ నుంచి చాలా నేర్చుకున్నాన‌ని, మ‌రింత స‌మ‌ర్థ‌వంత‌మైన ఆట‌గాడిగా మ‌ళ్లీ ఆడ‌తాన‌ని చెప్పాడు.

Virat Kohli: కోహ్లీ వర్సెస్ నవీన్-ఉల్-హక్ మధ్యలో రసాలూరే మ్యాంగో.. మామిడి పండ్లతో ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు?