Neeraj Chopra: మిల్కా సింగ్ కల నెరవేర్చా.. గోల్డ్ మెడల్ అంకితమిస్తున్నా

'మిల్కా సింగ్ కల నెరవేర్చా.. గోల్డ్ మెడల్ అంకితమిస్తున్నా' ఈ మాటలు చెప్పింది గోల్డ్ విన్నర్ నీరజ్ చోప్రా. శనివారం టోక్యో వేదికగా జరిగిన మెగా టోర్నీ ఒలింపిక్స్ 2020లో స్వర్ణం గెలిచిన తర్వాత చెప్పిన మాటలవి. దిగ్గజ ట్రాక్ అథ్లెట్ కొవిడ్-19 కారణంగా జూన్ లో మరణించిన సంగతి తెలిసిందే.

Neeraj Chopra: మిల్కా సింగ్ కల నెరవేర్చా.. గోల్డ్ మెడల్ అంకితమిస్తున్నా

Milka Singh Neeraj Chopra (1)

Neeraj Chopra: ‘మిల్కా సింగ్ కల నెరవేర్చా.. గోల్డ్ మెడల్ అంకితమిస్తున్నా’ ఈ మాటలు చెప్పింది గోల్డ్ విన్నర్ నీరజ్ చోప్రా. శనివారం టోక్యో వేదికగా జరిగిన మెగా టోర్నీ ఒలింపిక్స్ 2020లో స్వర్ణం గెలిచిన తర్వాత చెప్పిన మాటలవి. దిగ్గజ ట్రాక్ అథ్లెట్ కొవిడ్-19 కారణంగా జూన్ లో మరణించిన సంగతి తెలిసిందే. గోల్డ్ మెడల్ ను గెలిచి ఆయన్ను గుర్తు చేసుకుంటూ స్వర్ణ పతకాన్ని అంకితం చేశారు నీరజ్ చోప్రా.

‘స్టేడియంలో భారత జాతీయ గీతం వినాలనుకున్నారు మిల్కా సింగ్. ఆయన మనతో లేకపోయినా కల నెరవేరింది. ఈ స్వర్ణాన్ని ఆయనకే అంకితమిస్తున్నా’ అని 23ఏళ్ల నీరజ్ వివరించారు. 1960లో జరిగిన రోమ్ ఒలింపిక్స్ లో నాలుగో స్థానంలో నిలిచిన ఐకానిక్ స్ప్రింటర్ ను మరోసారి గౌరవించాడు.

వ్యక్తిగత జాబితాలో గోల్డ్ దక్కించుకున్న రెండో ప్లేయర్.. చోప్రా. ఫస్ట్ త్రోలోనే ఫైనల్ కు వెళ్లి.. ఫైనల్ గేమ్ లో 87.58మీటర్లు విసిరి గోల్డ్ గెలుచుకున్నాడు. 13ఏళ్ల నిరీక్షణ తర్వాత వ్యక్తిగత ఖాతాలో స్వర్ణం రాగా, అథ్లెటిక్స్ నీరజ్ అందుకుంది తొలి స్వర్ణం.

‘ఇలా జరగాలని డాడ్ చాలా కాలం ఎదురుచూశారు. ఆయన కల మొత్తానికి నెరవేరింది. భారత్‌కు తొలి స్వర్ణం అందింది. ఈ ట్వీట్ చేస్తున్నప్పుడు నాకు ఏడుపొస్తుంది. నాన్న కూడా పైనుంచి చూస్తూ ఉంటారు. ఇది సాధించినందుకు ధన్యవాదాలు’ అంటూ మిల్కా సింగ్ కొడుకు జీవ్ ట్వీట్ చేశారు. మిల్కా ఫ్యామిలీ ఈ గౌరవాన్ని ఎప్పుడూ గొప్పగానే భావిస్తుందని అన్నారు.