Tokyo Olympics : మరో పతకం లభిస్తుందా ? నీరజ్ పైనే అందరి దృష్టి

Javelin Throw Final : ఒలింపిక్ లో మరో పతకం రావాలని భారతీయులు కోరుకుంటున్నారు. పతకం సాధించడానికి ఒక్క అడుగులో నిలిచిన పలువురు క్రీడాకారులు పరాజయం చెందిన సంగతి తెలిసిందే. తాజాగా…అథ్లెటిక్స్ విభాగంలో ఒలింపిక్ పతకాన్ని భారత్ కు లభిస్తుందా ? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్ 2021, ఆగస్టు 07వ తేదీ శనివారం జరుగనుంది.

ఇందులో భారత ప్లేయర్ నీరజ్ చోప్రాపై అందరి దృష్టి నెలకొంది. హర్యాణా రాష్ట్రానికి చెందిన నీరజ్…రాణిస్తున్నాడు. క్వాలిఫయింగ్ లో అత్యంత ప్రతిభను చూపెట్టి…86.59 మీటర్ల దూరంలో విసిరి…టాపర్ గా నిలిచాడు. అదే పోరును కొనసాగించాలని ప్రతొక్కరూ కోరుకుంటున్నారు. ఫైనల్ కు చేరుకున్న నీరజ్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇక్కడ కూడా ప్రావీణ్యాన్ని పునరావృతం చేస్తాడా అని అందరూ అనుకుంటున్నారు.

నీరజ్ తో పాటు జోనస్‌ వెటెర్‌ (జర్మనీ), జాకుబ్‌ వాద్లెచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌), వితెస్లా వెసిలీ (చెక్‌ రిపబ్లిక్‌), వెబెర్‌ (జర్మనీ) పోటీ పడుతున్నారు. 12 మంది పోటీ పడుతున్న ఫైనల్ లో తొలుత అందరికీ అవకాశాలు లభిస్తాయి. టాప్ -8లో నిలిచిన వారికి మరో మూడు అవకాశాలు కల్పిస్తారు. అనంతరం టాప్ -3లో నిలిచిన వారికి పతకాలు లభిస్తాయి.

ట్రెండింగ్ వార్తలు