Neeraj Chopra: మరో రికార్డ్ క్రియేట్ చేసిన నీరజ్ చోప్రా

ప్రస్తుతం ఈవెంట్ లో నీరజ్ చోప్రాకు సిల్వర్ మెడల్ దక్కింది. టోక్యో వేదికగా బంగారం గెలుచుకున్న నీరజ్.. ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత ఆడిన తొలి ఈవెంట్ ఇదే. ఫిన్ లాండ్ వేదికగా జరిగిన ఈవెంట్ లో..

Neeraj Chopra: మరో రికార్డ్ క్రియేట్ చేసిన నీరజ్ చోప్రా

Neeraj Chopra

Neeraj Chopra: ఇండియన్ దిగ్గజ జావెలిన్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. ఫిన్‌లాండ్ వేదికగా జరిగిన పావో నర్మి గేమ్స్ లో 89.30మీటర్లు విసిరాడు. చోప్రా గతేడాది మార్చిలో పటియాలా వేదికగా 88.07మీటర్ల దూరం మాత్రమే విసరగలిగాడు. చివరికి 2021 ఆగష్టు 7న ఒలింపిక్ ఈవెంట్ లోనూ 87.58మీటర్లు మాత్రమే విసిరి భారత్‌కు గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టాడు.

ప్రస్తుతం ఈవెంట్ లో నీరజ్ చోప్రాకు సిల్వర్ మెడల్ దక్కింది. టోక్యో వేదికగా బంగారం గెలుచుకున్న నీరజ్.. ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత ఆడిన తొలి ఈవెంట్ ఇదే. ఫిన్ లాండ్ వేదికగా జరిగిన ఈవెంట్ లో అదే దేశానికి చెందిన ఆలివర్ హెలాండర్ 89.83 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు.

నీరజ్ చోప్రా.. ఈటెను 89.30 మీటర్లకు విసిరే ముందు ఆకట్టుకునే 86.92 మీటర్లతో ప్రారంభించాడు. అతను తన ఆరో.. చివరిదైన త్రోలో 85.85 మీటర్లు విసిరాడు. మూడు ప్రయత్నాలు ఫౌల్ అయ్యాయి.

Read Also: 428 కోట్ల‌కు చేరిన నీరజ్ చోప్రా సోష‌ల్ మీడియా విలువ‌

పోటీ నిర్వాహకులు జావెలిన్ త్రోయర్‌లకు అదనపు ప్రోత్సాహాన్ని అందించే దిశగా ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు. ఫిన్నిష్ రికార్డు 93.09 మీటర్లకు మించి విసిరే ఎవరైనా ఫోర్డ్ ముస్టాంగ్ మాక్-ఇ SUVని గెలుచుకుంటారని ప్రకటించారు. మంగళవారం ఎవరూ దానిని గెలుచుకోలేకపోవడం గమనార్హం. ఈ ఈవెంట్‌లను చూసేందుకు 10,000 మంది పైగా తరలి రావడం విశేషం.