Neeraj Chopra: బ్రేక్ కావాలి.. ఈ సంవత్సరం ఇక ఆడేది లేదు – నీరజ్ చోప్రా

ఒలింపిక్ గోల్డ్ విన్నర్ నీరజ్ చోప్రా.. బ్రేక్ తీసుకుంటానని ఈ ఏడాది ఇక ఆడనంటూ చెప్పేశాడు. అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా మనోగతాన్ని వ్యక్తపరిచాడు.

Neeraj Chopra: బ్రేక్ కావాలి.. ఈ సంవత్సరం ఇక ఆడేది లేదు – నీరజ్ చోప్రా

Neeraj Chopra (1)

Neeraj Chopra: ఒలింపిక్ గోల్డ్ విన్నర్ నీరజ్ చోప్రా.. బ్రేక్ తీసుకుంటానని ఈ ఏడాది ఇక ఆడనంటూ చెప్పేశాడు. అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా మనోగతాన్ని వ్యక్తపరిచాడు.

‘టోక్యో నుంచి తిరిగొచ్చిన ముందుగా మీరు చూపిస్తున్న ప్రేమ, ఎఫెక్షన్‌కు థ్యాంక్స్. దేశవ్యాప్తంగా మీరు చూపించిన సపోర్ట్‌కు పొంగిపోయా. మీరు చూపించిన ఔన్నత్యాన్ని వ్యక్తపరచడానికి నా దగ్గర మాటల్లేవు’

‘టోక్యో నుంచి వచ్చాక షెడ్యూల్‌కు అనుగుణంగా ప్రయాణించడానికి ఆరోగ్యం సహకరించడం లేదు. అందుకే 2021 కాంపిటీషన్ సీజన్ ను ఇక్కడితో ఆపేసి కాస్త సమయం రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా. 2022 నాటికి రీఛార్జ్ అయి మునుపటి కంటే సమర్థవంతంగా తిరిగి రావాలని అనుకుంటున్నా. వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, ఆసియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్’

‘కొద్ది వారాలుగా అందరి నుంచి ఎంకరేజ్‌మెంట్ దొరుకుతుంది. అలాగే ఇండియన్ అథ్లెట్లు అందరినీ కొన్ని నెలలు, సంవత్సరాల పాటు సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నా. జై హింద్’ అని ముగించాడు.