Neeraj Chopra : 428 కోట్ల‌కు చేరిన అథ్లెట్ నీరజ్ చోప్రా సోష‌ల్ మీడియా విలువ‌

నీరజ్ చోప్రా.. ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ఐన పేరు. టోక్యో ఒలింపిక్స్ కి ముందు ఈ పేరు చాలా తక్కువ మందికే తెలుసు.. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత అతని పేరు మారుమోగిపోయింది.

Neeraj Chopra : 428 కోట్ల‌కు చేరిన అథ్లెట్ నీరజ్ చోప్రా సోష‌ల్ మీడియా విలువ‌

Neeraj Chopra (2)

Neeraj Chopra : నీరజ్ చోప్రా.. ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ఐన పేరు. టోక్యో ఒలింపిక్స్ కి ముందు ఈ పేరు చాలా తక్కువ మందికే తెలుసు.. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత నీరజ్ చోప్రా పేరు మారుమోగిపోయింది. అథ్లెటిక్స్ లో దేశానికి తోలి బంగారు పతకం అందించడంతో నేషనల్ హీరో అయిపోయాడు. ఒక్క గోల్డ్ తో దేశంలో అత్యంత పాపులారిటీ ఉన్న క్రికెటర్లను సోషల్, డిజిటల్ మీడియాల్లో వెనక్కు నెట్టాడు.

Read More : Neeraj Chopra : కోహ్లితో సమానం..! వెయ్యి రెట్లు పెరిగిన నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ

గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత నీరజ్ ఫాలోయింగ్ లో క్రికెటర్లను దాటేశారు. బయటే కాదు సోషల్, డిజిటల్ మీడియాల్లో నీరజ్ నామజపం చేస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్ సందర్బంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ప్రస్తావించిన అథ్లెట్ గా నీరజ్ రికార్డు సృష్టించారు. ఒలింపిక్స్ స‌మ‌యంలో మొత్తం 14 ల‌క్ష‌ల మంది 29 ల‌క్ష‌ల‌సార్లు ఇన్‌స్టాగ్రామ్‌లో నీర‌జ్ పేరును ప్ర‌స్తావించ‌డం విశేషం.

ఆన్‌లైన్‌లో నీరజ్ పేరు ప్రస్తావించిన రేటు 2055 శాతం పెరిగినట్లు YouGov SPORT అనే క‌న్స‌ల్టెన్సీ చేసిన రీసెర్చ్‌లో వెల్లడైంది. ఒలింపిక్స్ పతకం విజయంతో సోషల్, డిజిటల్ మీడియాలో నీరజ్ రీచ్ 41.2 కోట్లకు చేరింది. ఇది కాస్తా అత‌ని సోష‌ల్ మీడియా విలువ‌ను రూ.428 కోట్ల‌కు తీసుకెళ్లింది.

Read More : Amyra Dastur: అందాలతో చితక్కొట్టేస్తున్న అమైరా దస్తూర్

బంగారు పతకం గెలిచిన‌ప్ప‌టి నుంచీ సోష‌ల్ మీడియాలో నీర‌జ్ చోప్రా గురించి చ‌ర్చ‌ల సంఖ్య 1.27 కోట్ల‌కు చేరుకుంది. అత‌నికి సంబంధించిన వీడియోల‌కు కూడా వ్యూస్ క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చాయి. ప్రస్తుతం నీరజ్ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 45 లక్షలకు చేరింది. గోల్డ్ గెలిచిన తర్వాత ఫాలోవర్ల సంఖ్య 2297 రెట్లు పెరిగింది.