Ben Cooper Retirement : 29ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై.. బెన్ కూపర్ ఎమోషనల్‌ కామెంట్స్‌!

నెదర్లాండ్స్ క్రికెటర్ బెన్ కూపర్ 29ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన ట్విట్టర్‌ ద్వారా రిటైర్మెంట్ ప్రకటన చేస్తూ కూపర్ ఎమోషనల్ అయ్యాడు.

Ben Cooper Retirement : 29ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై.. బెన్ కూపర్ ఎమోషనల్‌ కామెంట్స్‌!

Netherlands' Ben Cooper Ret

Ben Cooper Retirement : నెదర్లాండ్స్ క్రికెటర్ బెన్ కూపర్ 29ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్టు కూపర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. గత ఎనిమిదేళ్లుగా నెదర్లాండ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కూపర్.. తన రిటైర్మెంట్ ప్రకటన వెనుక బలమైన కారణాన్ని వెలిబుచ్చాడు.

ఈ సందర్భంగా కూపర్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. జట్టులో స్టార్‌ ఆటగాడిగా వెలుగొందిన కూపర్.. 2013 ఆగస్టులో కెనడాతో జరిగిన వన్డే మ్యాచ్‌‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 3 నెలలకు అప్ఘానిస్తాన్‌తో జరిగిన టీ20ల్లో అరంగేట్రం చేశాడు. మరికొన్నిరోజుల్లో నేను 30ఏళ్లలోకి అడుగుపెట్టబోతున్నా.. 10ఏళ్ల పాటు డచ్‌ క్రికెట్‌కు సేవలందించాను..

అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు పెద్దగా అవకాశాలేవు. ప్రపంచకప్‌ వంటి టోర్నీల్లో మాత్రమే ఎక్కువ మ్యాచ్‌లు ఆడేందుకు అవకాశం లభిస్తుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. నేను ఇప్పుడు తప్పుకుంటేనే కొత్త ఆటగాళ్లకు అవకాశం వస్తుంది. చేసేది ఏమిలేకనే అంతర్జాతీయ ఆటకు గుడ్‌బై చెప్పేస్తున్నాను.. ఇదే సరైన సమయమని అనుకుంటున్నా’ అని కూపర్ ఎమోషనల్ అయ్యాడు. 2021 జూన్‌లో శ్రీలంకతో చివరి వన్డేలో బెన్‌ కూపర్‌ రాణించాడు. శ్రీలంకతో ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో ఆడాడు. ఇదే అతడికి ఆఖరి టీ20 మ్యాచ్.. నెదర్లాండ్స్‌ తరపున టి20ల్లో అత్యధిక పరుగులు సాధించాడు.


58 టి20 మ్యాచ్‌ల్లో 28.15 సగటుతో 1239 పరుగులు సాధించిన కూపర్.. మరో 13 వన్డేల్లో 187 పరుగులు సాధించాడు. దేశవాలీ క్రికెట్‌ లోనూ 29 ఏళ్ల బెన్‌ కూపర్‌ తనదైన ఆటతో సత్తా చాటాడు. 4 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 451 పరుగులు చేసిన కూపర్.. 55 లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో 994 పరుగులను నమోదు చేశాడు. @kncbcricket చిన్ననాటి కలను జీవించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు కూపర్.. అద్భుతమైన జ్ఞాపకాలను అందించినందుకు నెదర్లాండ్స్ జట్టుకు ఇతర సహచరులకు, కోచ్‌లకు అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

Read Also : Tollywood : రాజమౌళి ట్వీట్‌‌.. విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లు