Yuzvendra Chahal: చాహల్‌ను టీ20 వరల్డ్ కప్‌కు ఎందుకు సెలక్ట్ చేయలేదో అర్థం కావడం లేదు – సెహ్వాగ్

గత రెండు మ్యాచ్ లుగా చాహల్ ఏదో కొత్తగా చేశాడని కాదు. ప్రతి సారి ఒకేలా చేస్తుంటాడు. శ్రీలంకలోనూ కచ్చితంగా అలాగే.. ఫార్మాట్ కు తగ్గట్టు బౌలింగ్ చేశాడు' అని అన్నాడు.

Yuzvendra Chahal: చాహల్‌ను టీ20 వరల్డ్ కప్‌కు ఎందుకు సెలక్ట్ చేయలేదో అర్థం కావడం లేదు – సెహ్వాగ్

Virender Sehwag

Yuzvendra Chahal: టీ20 వరల్డ్ కప్ జట్టుకు యుజ్వేంద్రచాహల్ ను ఎంచుకోకపోవడం వెనుక కారణం అర్థం కావడంలేదంటున్నాడు వీరేంద్ర సెహ్వాగ్. అక్టోబర్ 17నుంచి మొదలుకానున్న టోర్నీలో టీమిండియా తొలి మ్యాచ్ ను అక్టోబర్ 24న పాకిస్తాన్ ను ఢీకొట్టనుంది.

‘గత రెండు మ్యాచ్ లుగా చాహల్ ఏదో కొత్తగా చేశాడని కాదు. ప్రతి సారి ఒకేలా చేస్తుంటాడు. శ్రీలంకలోనూ కచ్చితంగా అలాగే.. ఫార్మాట్ కు తగ్గట్టు బౌలింగ్ చేశాడు’ అని అన్నాడు. ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా ఆర్సీబీ వర్సెస్ సీఎస్కేతో జరిగిన మ్యాచ్ లో ప్రదర్శన పట్ల కొనియాడాడు.

‘ఇవాల్టి మ్యాచ్ లో గ్లెన్ మ్యాక్స్ వెల్, చాహల్ గేమ్ ను తిప్పేశారు. ఆర్సీబీకి మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టి.. గేమ్ గెలిచారు. ముంబై ఒకవైపునుంచి మంచి బ్యాటింగ్ లైనప్ తో ఉంది. టార్గెట్ ను చాలా ఈజీగా చేయగలరు కానీ, ఆ అంచనాల్ని తిప్పికొట్టారు. అని ప్రశంసించాడు.

……………………………….: పాదాలతో అబితాబ్ బొమ్మ వేసిన యువకుడు..ఫిదా అయిన బిగ్ బీ

టీ20 వరల్డ్ కప్ తీసుకున్న ప్లేయర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, అక్సర్ పటేల్ లు ఉన్నారు.

ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోహ్లి సేన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 166 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై 18.1 ఓవర్లలోనే 111 పరుగులకు ఆలౌట్ అయ్యింది.