India vs New Zealand: లాథమ్ 145, విలియమ్సన్ 94 పరుగులు.. టీమిండియా ఓటమి

భారత్-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య ఇవాళ ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో జరిగిన తొలి వన్డే మ్యాచులో టీమిండియా ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కు టీమిండియా 307 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణించడంతో ఆ జట్టు లక్ష్యాన్ని 47.1 ఓవర్లలోనే ఛేదించింది.

India vs New Zealand: లాథమ్ 145, విలియమ్సన్ 94 పరుగులు.. టీమిండియా ఓటమి

India vs New Zealand

India vs New Zealand: భారత్-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య ఇవాళ ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో జరిగిన తొలి వన్డే మ్యాచులో టీమిండియా ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కు టీమిండియా 307 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణించడంతో ఆ జట్టు లక్ష్యాన్ని 47.1 ఓవర్లలోనే ఛేదించింది.

న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ లో ఫిన్ అల్లెన్ 22, డెవాన్ కాన్వే 24, కానె విలియమ్సన్ (నాటౌట్) 94, డరిల్ మిచెల్ 11, లాథమ్ 145 (నాటౌట్) పరుగులు చేశారు. ఎక్స్‌ట్రాల రూపంలో న్యూజిలాండ్ కు 13 పరుగులు వచ్చాయి. దీంతో న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 2, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్టు తీశారు.

అంతకు ముందు టీమిండియా బ్యాట్స్ మెన్ లో శిఖర్ ధావన్ 72, శుభ్ మన్ గిల్ 50, శ్రేయాస్ అయ్యర్ 80, రిషబ్ పంత్ 15, సూర్యకుమార్ యాదవ్ 4, సంజూ శాంసన్ 36, వాషింగ్టన్ సుందర్ 37 (నాటౌట్), శార్దూల్ 1 పరుగులు తీశారు. టీమిండియా ఓడిపోవడంతో వన్డే సిరీస్ లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. భారత్ టీ20 మ్యాచులను హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడింది. మూడు వన్డే మ్యాచుల సిరీస్ ను శిఖర్ ధావన్ సారథ్యంలో ఆడుతోంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..