Team India: టెస్ట్ సిరీస్ కెప్టెన్‌గా అజింకా రహానె

భారత సొంతగడ్డపై ఆడుతున్న 3టీ20లు, 2టెస్టు మ్యాచ్ ల సిరీస్ లలో భాగంగా జట్టుల్లోని పేర్లను ప్రకటించారు. అందులో రోహిత్ శర్మ టీ20కి మాత్రమే కెప్టెన్ గా ఉంటుండగా.. టెస్టు ఫార్మాట్ కు...

Team India: టెస్ట్ సిరీస్ కెప్టెన్‌గా అజింకా రహానె

Virat Kohli

Team India: టీ20 వరల్డ్ కప్ 2021 ముగిసిన వెంటనే అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అయిపోతానని విరాట్ కోహ్లీ ముందే చెప్పాడు. అనుకున్నట్లుగానే రిటైర్ అవగా న్యూజిలాండ్ తో టీ20 మ్యాచ్ లకు రోహిత్ కెప్టెన్ అయ్యాడు. కేఎల్ రాహుల్ ను వైస్ కెప్టెన్ చేస్తూ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది బీసీసీఐ.

భారత సొంతగడ్డపై ఆడుతున్న 3టీ20లు, 2టెస్టు మ్యాచ్ ల సిరీస్ లలో భాగంగా జట్టుల్లోని పేర్లను ప్రకటించారు. అందులో రోహిత్ శర్మ టీ20కి మాత్రమే కెప్టెన్ గా ఉంటుండగా.. టెస్టు ఫార్మాట్ కు గైర్హాజరీ అవుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ మెగా ఈవెంట్ కు ముందే విరాట్ కు విశ్రాంతి కావాలని అడగ్గా… ఇప్పుడు టీ20 ఫార్మాట్ తర్వాత రోహిత్ కూడా రెస్ట్ లోకి వెళ్లిపోతున్నాడు.

ఫలితంగా టెస్టు ఫార్మాట్ కు ఇద్దరూ అందుబాటులో లేకపోతుండటంతో అజింకా రహానె కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. చేతన శర్మ అధ్యక్షతన టీ20 సిరీస్ కు, టెస్టు సిరీస్ కు ప్లేయర్ల పేర్లను పరిశీలించింది. నవంబర్ 25నుంచి జరగనున్న ఫార్మాట్ కు కెప్టెన్ రహానె.

 

………………………………………: టెస్ట్ సిరీస్ కెప్టెన్‌గా అజింకా రహానె

అంతార్జాతీయ టెస్టులు ఐదింటికి కెప్టెన్సీ వహించిన అనుభవమున్న రహానె.. 2017నుంచి టెస్టు ఫార్మాట్ వైస్ కెప్టెన్ గా ఉంటున్నాడు. ఈ ఫార్మాట్ కు రిషబ్ పంత్, మొహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్ లు కూడా రెస్ట్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే పంత్ కు బదులుగా సాహా వికెట్ కీపర్ గా కనిపించనుండటం ఖాయం.