మైలురాయి : మిథాలీ @ 200వ వన్డే

  • Published By: madhu ,Published On : February 1, 2019 / 03:33 AM IST
మైలురాయి : మిథాలీ @ 200వ వన్డే

ఢిల్లీ : భారత కెప్టెన్, హైదరాబాద్ వాసి మిథాలీ రాజ్ మరో మైలురాయి చేరుకోనుంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో 200 వన్డేలు ఆడిన తొలి క్రికేటర్‌గా రికార్డు సృష్టించనుంది. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం న్యూజిలాండ్‌తో భారత మహిళల జట్టు మూడో వన్డే ఆడనుంది. ఇప్పటికే 2-0తో సిరీస్ నెగ్గిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ నెగ్గాలని మిథాలీ టీం తహతహలాడుతోంది. 

1999లో ఐర్లాండ్‌పై మిథాలీ తొలి వన్డే ఆడారు. తన 20 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు 199 వన్డేలు ఆడారు. 179 ఇన్నింగ్స్ ఆడిన ఆమె…51.66 సగటుతో 6,613 పరుగులు చేశారు. అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మిథాలీ 7 సెంచరీలు, 52 అర్థ సెంచరీలు చేశారు. మొత్తం 51 సార్లు నాటౌట్‌గా నిలిచిన మిథాలీ…6సార్లు మాత్రం డకౌట్‌గా వెనుదిరిగారు.