వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్

వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌కు వర్షం కారణంగా ఆటంకం కలిగింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌.. భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తూ వచ్చింది. కెప్టెన్ కోహ్లీ(2)పరుగులకే వెనుదిరగడం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. అజింకా రహానె క్రీజులో నిలదొక్కుకోవడానికి అతి కష్టంపై ప్రయత్నిస్తున్నాడు. క్రీజులో రహానె(38; 122బంతుల్లో 4ఫోర్లు)తో పాటు రిషబ్ పంత్(10)ఉన్నారు. 

ఓపెనర్లుగా మయాంక్‌ అగర్వాల్‌(34), పృథ్వీ షా(16) బరిలోకి దిగారు. తడబడుతున్న టీమిండియా బ్యాట్స్‌మెన్‌ 101 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయారు. ఓపెనర్‌ పృథ్వీషా(16), పుజారా(11), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(2) విఫలమయ్యారు. 41.1 ఓవర్‌లో హనుమ విహారి(7) జామీసన్‌ బౌలింగ్‌లో అవుటవడంతో ఐదు వికెట్లు కుప్పకూలాయి. 

కివీస్‌ బౌలర్లలో కైల్‌ జామీసన్‌ 3 వికెట్లు తీయగా టిమ్‌సౌథీ, ట్రెంట్‌బౌల్ట్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. మయాంక్‌ అగర్వాల్‌ (34; 84 బంతుల్లో 5ఫోర్లు) ట్రెంట్‌బౌల్ట్ బౌలింగ్‌లో జామీసన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.