NZ v IND T20 : 2-1 తేడాతో సిరీస్ న్యూజిలాండ్ వశం

  • Published By: madhu ,Published On : February 10, 2019 / 10:30 AM IST
NZ v IND T20 : 2-1 తేడాతో సిరీస్ న్యూజిలాండ్ వశం

హామిల్టన్ : లాస్ట్ టి20 మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. కివీస్ విధించిన 212 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా చేధించకలేకపోయింది. కేవలం 4 రన్లతో న్యూజిలాండ్ టీం విజయం సాధించింది. దీనితో 2 – 1 తేడాతో కివీస్ సిరీస్‌ని వశం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు మాత్రమే చేసింది. 

గ్రౌండ్‌‌లోకి అడుగుపెట్టడమే ఆలస్యం…ధావన్ (5) వెనుదిరిగాడు. శర్మకు….విజయ శంకర్ తోడయ్యాడు. అప్పటికే శర్మ కొద్దిగా ధాటిగా ఆడుతున్నాడు. వీరిద్దరూ కలిసి కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లే కనిపించింది. వీరు క్రీజులో నిలదొక్కుకొంటే ప్రమాదమని భావించిన కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను విసరడం ప్రారంభించారు. జట్టు స్కోరు 81 పరుగుల వద్ద ఉండగా శంకర్ (43) వెనుదిరిగాడు.

అనంతరం వచ్చిన పంత్..బ్యాట్‌కి పని చెప్పాడు. శర్మ..పంత్‌లు స్కోరు బోర్డును పరుగెత్తించే పనిలో పడిపోయారు. మంచి ఊపు మీదున్న శర్మ (38)ను మైకెల్ అవుట్ చేశాడు. అప్పటికీ జట్టు స్కోరు 121. పాండ్యా 21 రన్లు సాధించి పెవిలియన్ చేరగా..మెరుపులు మెరిపిస్తాడని అనుకున్న ధోని (2) వెనుదిరిగాడు. అప్పటికే 20 ఓవర్లు అయిపోయాయి. భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. కార్తీక్ 33, పాండ్యా 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

* కివీస్ బౌలర్లలో శాంట్నర్, మిచెల్‌లు చెరో 2 వికెట్లు…కుగ్లీన్, టిక్నర్‌లు చెరో వికెట్ తీశారు. 
* భారత బౌలర్లలో కుల్డీప్ యాదవ్ 2 వికెట్లు… భువనేశ్వర్, అహ్మద్‌లు చెరో వికెట్ తీశారు.
* కివీస్ ప్లేయర్ మన్రోకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్…ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ సీఫ్రెట్‌కు దక్కింది.