IPL-2023: కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ స్థానంలో నితీశ్ రాణా

శ్రేయాస్ అయ్యర్ త్వరగా కోలుకుని ప్రస్తుత ఐపీఎల్ లో కొన్ని మ్యాచుల తర్వాత అయినా ఆడాలని తాము కోరుకుంటున్నట్లు కేకేఆర్ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నితీశ్ రాణా కేకేఆర్ నుంచి 74 మ్యాచులు ఆడాడు.

IPL-2023: కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ స్థానంలో నితీశ్ రాణా

IPL-2023

IPL-2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023(IPL 2023)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ( Kolkata Knight Riders) కెప్టెన్ గా నితీశ్ రాణాను అధికారికంగా ప్రకటించింది ఆ జట్టు. శ్రేయాస్ అయ్యర్ వెన్నెముక గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఈ ఐపీఎల్ లో ఆడలేకపోతున్నాడు. దీంతో నితీశ్ రాణా కోల్ కతా నైట్ రైడర్స్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

శ్రేయాస్ అయ్యర్ త్వరగా కోలుకుని ప్రస్తుత ఐపీఎల్ లో కొన్ని మ్యాచుల తర్వాత అయినా ఆడాలని తాము కోరుకుంటున్నట్లు కేకేఆర్ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నితీశ్ రాణా కేకేఆర్ నుంచి 74 మ్యాచులు ఆడాడు. 135.61 స్ట్రైక్ రేట్ తో 1,744 పరుగులు చేశాడు. రాష్ట్ర స్థాయిలో ఢిల్లీ కెప్టెన్ గా అతడి అనుభవం ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు కేకేఆర్ తెలిపింది. 2018 నుంచి కేకేఆర్ జట్టు తరఫున రాణా ఆడుతున్నాడని గుర్తు చేసింది.

కాగా, ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. మే 28 వరకు ఈ సీజన్ ఐపీఎల్ జరుగుతుంది. తొలి మ్యాచు అహ్మదాబాద్ లో మోతెరా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది. మొత్తం 10 జట్ల మధ్య 70 లీగ్ మ్యాచులు ఉంటాయి. మే 28న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

Women’s World Boxing: వరుసగా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‭గా నిఖత్ జరీన్.. WBCలో గోల్డ్