INDvsNZ: టీమిండియాతో న్యూజిలాండ్ టీ20 మ్యాచ్‌లకు స్టేడియాల్లోకి ఎంట్రీ

టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత టీమిండియా.. న్యూజిలాండ్ లు ఆడుతున్న తొలి టీ20 సిరీస్ కు గుడ్ న్యూస్. నవంబర్ 17న జరగనున్న టీ20 మ్యాచ్ కు స్టేడియాల్లోకి అభిమానులు వచ్చి చూడొచ్చు.

INDvsNZ: టీమిండియాతో న్యూజిలాండ్ టీ20 మ్యాచ్‌లకు స్టేడియాల్లోకి ఎంట్రీ

Indvsnz

INDvsNZ: టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత టీమిండియా.. న్యూజిలాండ్ లు ఆడుతున్న తొలి టీ20 సిరీస్ కు గుడ్ న్యూస్. నవంబర్ 17న జరగనున్న టీ20 మ్యాచ్ కు స్టేడియాల్లోకి అభిమానులు వచ్చి చూడొచ్చు. ఎటువంటి నిబంధనలు లేవని.. కేవలం కొవిడ్-19 వ్యాక్సిన్ సింగిల్ డోస్ తీసుకుని ఉంటే సరిపోతుందని నిర్వాహకులు చెబుతున్నారు.

ఒకవేళ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వాళ్లైతే కొవిడ్ నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకుని రావాలని.. 48గంటల లోపే జరిపిన టెస్టు ఫలితం మాత్రమే వ్యాలిడ్ అని చెబుతున్నారు. సవాయ్ మాన్సింగ్ స్టేడియం కెపాసిటీ 25వేలు ఉండగా.. ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి ఇంటర్నేషనల్ మ్యాచ్ కు వేదిక అవనుంది.

‘ప్రస్తుతం రాష్ట్రం అనుసరిస్తున్న నిబంధనల ప్రకారం.. స్డేడియం అభిమానులతో నిండిపోవడానికి అడ్డంకులు లేవు. కేవలం ఒకసారైనా కొవిడ్ డోస్ తీసుకోవాలి. లేదంటే కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ తోనైనా రావాలి. ఎంట్రన్స్ వద్ద వాటిని చూపిస్తేనే లోపలికి అనుమతిస్తారు’ అని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మహేంద్ర శర్మ అంటున్నారు.

…………………………………………….. : 9 జిల్లాలకు రెడ్ అలర్ట్… ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిక

మాస్కులు ధరించి లోపలికి రావాలని కఠిన ఆంక్షల తర్వాత జరుగుతున్న తొలి టీ20 కావడంతో చాలా ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నారు. ఎంట్రీ టిక్కెట్ రూ.1000 నుంచి రూ.15వేల వరకూ ఉంది. నవంబర్ 14న ఫైనల్ ఆడనున్న న్యూజిలాండ్ వెంటనే ఇండియాకు బయల్దేరాలి. టెస్టు స్క్వాడ్ లో ఉన్న తొమ్మిది మంది కివీస్ ప్లేయర్లు ఆల్రెడీ ఇండియాకు చేరుకున్నారు.

వరల్డ్ కప్ టోర్నమెంట్ తర్వాత టీమిండియా ఆటగాళ్లు సైతం ఇళ్లకు చేరుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే బయో బబుల్ లోకి ఎంటర్ అవనున్ారు. మూడు టీ20 మ్యాచ్ లతో పాటు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు టెస్టులు ఆడనున్నాయి ఇరు జట్లు.