WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో ర‌వీంద్ర జ‌డేజా నో ఛాన్స్‌.. అశ్విన్‌ను తీసుకున్న‌ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌

ఐపీఎల్(IPL) ముగిసింది. విజేత ఎవ‌రో తెలిసిపోయింది. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్(WTC Final 2023) మ్యాచ్ పై ప‌డింది.

WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో ర‌వీంద్ర జ‌డేజా నో ఛాన్స్‌.. అశ్విన్‌ను తీసుకున్న‌ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌

Ravichandran Ashwin-Ravindra Jadeja

WTC Final 2023- IND vs AUS: ఐపీఎల్(IPL) ముగిసింది. విజేత ఎవ‌రో తెలిసిపోయింది. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్(WTC Final 2023) మ్యాచ్ పై ప‌డింది. ఐసీసీ ప్రారంభించిన మొద‌టి సారే ఫైన‌ల్ కు చేరుకున్న‌ప్ప‌టికి న్యూజిలాండ్ చేతిలో టీమ్ఇండియా ఓడిపోయింది. వ‌రుస‌గా రెండ‌వ సారి ఫైన‌ల్‌కు చేరుకున్న భార‌త జ‌ట్టు క‌నీసం ఈసారి అయినా డ‌బ్ల్యూటీసీ టైటిల్‌ను గెల‌వాల‌ని స‌గ‌టు భార‌త అభిమాని కోరుకుంటున్నాడు.

జూన్ 7 నుంచి 11 వ‌ర‌కు లండ‌న్‌లోని ఓవ‌ల్ మైదానంలో భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య డబ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్ప‌టికే రెండు జ‌ట్లు ఓవ‌ల్ చేరుకుని ప్రాక్టీస్‌ను మొద‌లుపెట్టేశాయి. ఈ క్ర‌మంలో ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు రెండు జ‌ట్ల‌లోంచి ప‌లువురు కీల‌క‌మైన ఆట‌గాళ్ల‌తో క‌లిపి త‌మ‌కు న‌చ్చిన డ్రీమ్ టీమ్‌ను ఎన్నుకుంటున్నారు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ ఆట‌గాడు నాసిర్ హుస్సేన్ కూడా త‌న‌కు న‌చ్చిన జ‌ట్టును ఎన్నుకున్నాడు.

Ruturaj Gaikwad: రుతురాజ్‌ గైక్వాడ్ పెళ్లి చేసుకోబోయే ఉత్కర్ష పవార్ గురించిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

త‌న డ్రీమ్ టీమ్‌కు కెప్టెన్‌గా రోహిత్ ను ఎన్నుకున్నాడు. హిట్‌మ్యాన్ ఒక ఓపెన‌ర్ కాగా మ‌రో ఓపెన‌ర్‌గా ఉస్మాన్ ఖావాజాను తీసుకున్నాడు. వాస్త‌వానికి ప్ర‌స్తుతం శుభ్‌మ‌న్ గిల్ ఉన్న ఫామ్ ప్ర‌కారం చూసుకుంటే అత‌డికే చోటి ఇవ్వాలి కాని నేను మాత్రం ఖ‌వాజాను తీసుకుంటాన‌ని చెప్పాడు. మూడో స్థానంలో మార్న‌స్ లబుషేన్‌, నాలుగులో స్టీవ్ స్మిత్‌, ఐదో స్థానంలో విరాట్ కోహ్లిల‌కు చోటిచ్చాడు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ ఇండియా లేదా ఉప ఖండంలో జ‌రిగితే ఆల్‌రౌండ‌ర్‌గా ర‌వీంద్ర జ‌డేజాకు చోటు ఇచ్చేవాడిని అయితే ప్ర‌స్తుతం లండ‌న్‌లో జ‌రగ‌నుండ‌డంతో కామెరూన్ గ్రీన్‌ను తీసుకుంటున్న‌ట్లు తెలిపాడు.

ఇక వికెట్ కీప‌ర్‌గా అలెక్స్ క్యారీని, స్పిన్ బౌలింగ్ జాబితాలో అశ్విన్‌ను ఎంచుకున్నాడు. అత‌డు లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో చ‌క్క‌గా బ్యాటింగ్ చేస్తాడ‌ని అందుకే అత‌డిని తీసుకున్న‌ట్లు తెలిపాడు. ఇక పేస్ బౌలింగ్ విభాగంలో పాట్‌ క‌మిన్స్‌, మిచెల్ స్టార్క్‌ల‌కు చోటు ఇచ్చాడు. బుమ్రా గాయ‌ప‌డి ఉండ‌క‌పోతే ఖ‌చ్చితంగా అత‌డినే తీసుకునేవాడిని అత‌డు అందుబాటులో లేక‌పోవ‌డంతో ష‌మీని ఎంచుకుంటున్నా అని నాసిర్ హుస్సేన్ అన్నాడు.

Rishabh Pant: వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ముందు భార‌త అభిమానుల‌కు శుభ‌వార్త‌.. ఆ స్టార్ ప్లేయ‌ర్ రీ ఎంట్రీ.!

నాసిర్ హుస్సేన్ డ్రీమ్ టీమ్‌: రోహిత్ శర్మ (కెప్టెన్), ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌, మ‌హ్మ‌ద్‌ షమీ