ధోనీ.. దేశం కోసం రిటైర్ అవ్వాలి: గంభీర్

ధోనీ.. దేశం కోసం రిటైర్ అవ్వాలి: గంభీర్

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ దేశం గురించి చేసే వ్యాఖ్యలు వరకూ ఓకే ఎక్కువే కానీ, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని టార్గెట్ చేస్తే మాత్రం తిప్పలు తప్పడం లేదు. ధోనీ రిటైర్ అయితేనే బాగుంటుందని 2023వరల్డ్ కప్ సమయానికి భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న వాళ్లు ధోనీకి బదులు వేరే వాళ్లకు స్థానం కల్పించాలని అన్నాడు. అంతే గంభీర్‌పై విమర్శల దాడి పెరిగిపోయింది. 

‘రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత విషయమని అనుకుంటున్నా. ఎప్పటివరకూ ఆడాలనుకుంటే అప్పటి వరకూ కొనసాగించవచ్చు. దాంతోపాటు భవిష్యత్ గురించి కూడా ఆలోచించాలి కదా. నేను తర్వాత వరల్డ్ కప్ వరకూ జట్టులో ఉంటాడనుకోవడం లేదు. విరాట్ కోహ్లీ అయినా ఇంకా ఎవరైనా కెప్టెన్ గా ఉన్నప్పుడు ధోనీ లాంటి ఫిట్ గా లేని వ్యక్తి జట్టుకు సరిపోడని చెప్పగలిగే ధైర్యం ఉండాలి. యువ క్రికెటర్లకు అవకాశం కల్పించాల్సిన సమయం ఇది’ అని గంభీర్ అన్నాడు. 

ఇప్పుడు అవకాశాలు కల్పిస్తే నాలుగైదేళ్లలో వరల్డ్ కప్ నాటికి వారు మెరుగ్గా తయారవుతారు. ఇది ధోనీ కోసం కాదు దేశం కోసం. తర్వాతి వరల్డ్ కప్‌కు ధోనీ ఉంటాడనే దాని కంటే, వరల్డ్ కప్ గెలవాలని అనుకోవడం ముఖ్యం. రిషబ్ పంత్, సంజూ శాంసన్ లాంటి యువ క్రికెటర్లకు అవకాశాలు ఇస్తే వాళ్లు మెరుగవుతారు. నన్నడిగితే భారత క్రికెట్ ధోనీని దాటి ఆలోచించడమే ఉత్తమం’ అని గంభీర్ ఇంగ్లీష్ మీడియా ముందు ముచ్చటించాడు.