VVS Laxman: ‘అతడు ఓ గొప్ప లీడర్’.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై వీవీఎస్ లక్ష్మణ్

‘‘హార్దిక్ పాండ్యా ఓ గొప్ప లీడర్. ఐపీఎల్ లో అతడు గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఎలా ఆడాడో మనము చూశాం. అతడితో కలిసి చాలా కాలంగా పనిచేస్తున్నాను. అతడు వ్యూహాత్మకంగా ఆడే ఆటగాడే కాదు.. ఫీల్డింగ్ చేసే సమయంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్ లో, పనిలో అతడు కనబర్చే తీరు ఆదర్శప్రాయంగా ఉంటుంది. మైదానంలో, దాని బయట హార్దిక్ పాండ్యా కనబర్చే తీరు అద్భుతం. జట్టులోని ఆటగాళ్లు అందరూ అతడిని నమ్ముతారు’’ అని వీవీఎస్ లక్ష్మణ్ చెప్పారు.

VVS Laxman: ‘అతడు ఓ గొప్ప లీడర్’.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై వీవీఎస్ లక్ష్మణ్

VVS Laxman: న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా చీఫ్ కోచ్ గా నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నారు. టీ20 ప్రపంచ కప్ నుంచి టీమిండియా నిష్క్రమించాక రాహుల్ ద్రవిడ్ కోచింగ్ బృందానికి విశ్రాంతిని ఇవ్వడంతో ఆ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. అలాగే, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ తో జరగనున్న మ్యాచుల్లో ఆడడం లేదు. టీ20 సిరీస్ కి హార్దిక్ పాండ్యా, వన్డే సిరీస్ కి శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరిస్తారు. రేపటి నుంచి న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వీవీఎస్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.

‘‘హార్దిక్ పాండ్యా ఓ గొప్ప లీడర్. ఐపీఎల్ లో అతడు గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఎలా ఆడాడో మనము చూశాం. అతడితో కలిసి చాలా కాలంగా పనిచేస్తున్నాను. అతడు వ్యూహాత్మకంగా ఆడే ఆటగాడే కాదు.. ఫీల్డింగ్ చేసే సమయంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.

డ్రెస్సింగ్ రూమ్ లో, పనిలో అతడు కనబర్చే తీరు ఆదర్శప్రాయంగా ఉంటుంది. మైదానంలో, దాని బయట హార్దిక్ పాండ్యా కనబర్చే తీరు అద్భుతం. జట్టులోని ఆటగాళ్లు అందరూ అతడిని నమ్ముతారు’’ అని వీవీఎస్ లక్ష్మణ్ చెప్పారు.

‘‘నేషనల్ క్రికెట్ అకాడమీలో నేను పనిచేయడం ప్రారంభించాక నాకు ఉన్న క్రికెట్ అనుభవాలను యువతతో పంచుకునే అవకాశం నాకు దక్కింది. భారతీయ క్రికెట్ కు సహకారం అందించే ఛాన్స్ వచ్చింది. ఇది ఓ గొప్ప ప్రయాణం. వైట్ బాల్ క్రికెట్ లో ఆడడానికి ప్రత్యేకమైన ఆటగాళ్లు కావాలి. అటువంటి భారత కుర్రాళ్లు చాలా మందే ఉన్నారు. వారి నుంచి జట్టుకు సభ్యులను మేనేజ్ మెంట్ ఎంపిక చేయాల్సి ఉంటుంది.

చాలా స్వేచ్ఛగా టీ20 ఆడాలి. మన కుర్రాళ్లు టీమిండియాకు ఎంపిక కాక ముందు నుంచే నేను శిక్షణ ఇస్తూ వస్తున్నాను. వారు ఎదిగిన తీరును గమనిస్తూ వస్తున్నాను. టీ20ల్లో ఎటువంటి భయంలేని వైఖరితో ఆడాలి. జట్టు పరిస్థితులను అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ఆడాల్సి ఉంటుంది’’ అని వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..