IPL 2023: ఐపీఎల్-2023లో ట్రోఫీ ఏ జట్టు గెలుస్తుందో చెప్పేసిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం.. ముంబై-చెన్నై కాదు..

ఫైనల్ కు ఏయే జట్లు వెళ్తాయో కూడా చెప్పేశారు. అయితే, 5 సార్లు ట్రోఫీ గెలుచుకున్న ముంబై ఇండియన్స్, 4 సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి ట్రోఫీ గెలుచుకునే అవకాశం లేదని అంచనా వేశారు.

IPL 2023: ఐపీఎల్-2023లో ట్రోఫీ ఏ జట్టు గెలుస్తుందో చెప్పేసిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం.. ముంబై-చెన్నై కాదు..

IPL 2023

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్ లో ఫైనల్ కు ఏయే టీమ్స్ వెళ్తాయి? ఏ జట్టు గెలుపొందుతుంది? అన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో ఉంది. మాజీ క్రికెటర్లు ఈ విషయంపై ముందు నుంచే అంచనాలు వేసుకుంటుంటారు. ఏ జట్టు గెలుస్తుందని అంచనా వేసి వారు చెప్పే జోస్యం ఒక్కోసారి నిజమవుతుంది. తాజాగా, దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం, ఆల్ రౌండర్ జాక్వెస్ కల్లిస్ (Jacques Kallis ) ఐపీఎల్-2023 కప్ (IPL 2023 trophy) కొట్టే జట్టు ఏదో చెప్పేశారు.

ఫైనల్ కు ఏయే జట్లు వెళ్తాయో కూడా చెప్పేశారు. అయితే, 5 సార్లు ట్రోఫీ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians), 4 సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఈ సారి ట్రోఫీ గెలుచుకునే అవకాశం లేదని అంచనా వేశారు. “ఐపీఎల్ ప్లేఆఫ్ కు ఏయే జట్లు వెళ్తాయో అంచనా వేయడం క్లిష్టతరమే. ఎందుకంటే అన్ని జట్లూ సమాన నైపుణ్యాలతో, సమర్థతతో ఉంటాయి.

అయితే, ఈ సారి మాత్రం నేను ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని భావిస్తున్నాను. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్ గెలుస్తుంది” అని జాక్వెస్ కల్లిస్ (Jacques Kallis ) ఐపీఎల్-2023 గురించి చెప్పారు. ఢిల్లీ క్యాపిటల్స్ 2008లో ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క సారి కూడా ట్రోఫీ గెలుచుకోలేదు. ఆ జట్టే ఈ సారి ట్రోఫీ గెలుస్తుందని జాక్వెస్ కల్లిస్ (Jacques Kallis ) చెప్పడం గమనార్హం.

IPL 2023: “ఆడడానికి నేనూ వస్తున్నాను” అంటున్న రిషభ్ పంత్.. అక్కడే ఓ ట్విస్ట్.. వీడియో