Novak Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత జకోవిచ్.. పదోసారి టైటిల్ సొంతం

ఈ టైటిల్ గెలవడం ద్వారా జకోవిచ్.. అంతకుముందు అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా రఫెల్ నాదల్ పేరుతో ఉన్న రికార్డును సమం చేశాడు. రఫెల్ నాదల్ అత్యధికంగా 22 టైటిల్స్ గెలవగా, జకోవిచ్ కూడా ఈ టైటిల్ విజయంతో 22 టైటిల్స్ గెలిచినట్లైంది.

Novak Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత జకోవిచ్.. పదోసారి టైటిల్ సొంతం

Novak Djokovic: సెర్బియన్ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్-2023 టైటిల్ విజేతగా నిలిచాడు. జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకోవడం ఇది పదోసారి కావడం విశేషం. ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్‌లో గ్రీస్‌కు చెందిన మూడో సీడ్ స్టెఫనోస్ సిట్సిపస్‌పై 6-3, 7-6, 7-6 తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు.

Rashtrapati Bhavan: సందర్శకులకు అందుబాటులోకి రానున్న రాష్ట్రపతి భవన్ గార్డెన్.. మార్చి 26 వరకు అవకాశం

ఈ టైటిల్ గెలవడం ద్వారా జకోవిచ్.. అంతకుముందు అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా రఫెల్ నాదల్ పేరుతో ఉన్న రికార్డును సమం చేశాడు. రఫెల్ నాదల్ అత్యధికంగా 22 టైటిల్స్ గెలవగా, జకోవిచ్ కూడా ఈ టైటిల్ విజయంతో 22 టైటిల్స్ గెలిచినట్లైంది. ఈ టోర్నీలో ప్రదర్శన ద్వారా జకోవిచ్ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును సైతం కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకోవిచ్ వరుసగా 28 మ్యాచ్‌లు గెలుపొందడం మరో విశేషం. ఈ ఫైనల్ మ్యాచ్‌లో మూడు సెట్లలోనూ జకోవిచ్ ఆధిపత్యం ప్రదర్శించాడు. వరుస సెట్లు గెలుచుకుంటూ దూసుకెళ్లాడు.

Police Recruitment: తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 7 మార్కులు కలిపేందుకు బోర్డు అంగీకారం

గతంలో కూడా జకోవిచ్ సిట్సిపస్‌పై ఎక్కువ విజయాలు సాధించాడు. జకోవిచ్-సిట్సిపస్ మధ్య విజయాల సంఖ్య 11-2గా ఉంది. చివరిగా 2021 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో జకోవిచ్ సిట్సిపస్‌ను ఓడించాడు. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న అనంతరం జకోవిచ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్స్‌కు సంబంధించి జకోవిచ్ అత్యధిక టైటిల్స్ (10) గెలుచుకున్నాడు. జకోవిచ్ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023 టైటిల్స్ సాధించాడు.

ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన రాయ్ ఎమర్సన్, రోజర్ ఫెదరర్ తలో ఆరు టైటిల్స్ గెలుచుకుని తర్వాత స్థానాల్లో ఉన్నారు. మెన్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌కు సంబంధించి రఫెల్ నాదల్, జకోవిచ్ చెరో 22 టైటిల్స్ గెలిచారు. ఆ తర్వాత రోజర్ ఫెదరర్ 20 టైటిల్స్, పీట్ సంప్రాస్ 14 టైటిల్స్ గెలుచుకుని తర్వాతి స్థానాల్లో ఉన్నారు.