Wimbledon 2021 : వింబుల్డన్ 2021 విజేత జకోవిచ్

వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్ ఫైనల్ లో అందరూ అనుకున్నట్టుగానే నోవాక్ జకోవిచ్ విజయం సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్ లో ఇటాలియన్ ఆటగాడు మ్యాటియో బెరెటినితో తలపడ్డాడు జకోవిచ్. ఈ మ్యాచ్ లో 7-6,6-4,6-4,6-3 తో విజయం సాధించాడు.

Wimbledon 2021 : వింబుల్డన్ 2021 విజేత జకోవిచ్

Wimbledon 2021 (2)

Wimbledon 2021 : వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్ ఫైనల్ లో అందరూ అనుకున్నట్టుగానే నోవాక్ జకోవిచ్ విజయం సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్ లో ఇటాలియన్ ఆటగాడు మ్యాటియో బెరెటినితో తలపడ్డాడు జకోవిచ్. ఈ మ్యాచ్ లో 7-6,6-4,6-4,6-3 తో విజయం సాధించాడు.

ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో చివరకు జకోవిచ్ విజేతగా నిలిచాడు. కాగా సెమి ఫైనల్ లో ఓవర్ కాస్ట్ సెంటర్ కోర్టులో కెనడియన్ ఆటగాడైన 22 ఏళ్ళ డెనిస్ శాపవాలోవ్ తో తలపడ్డాడు జకోవిచ్ ఈ మ్యాచ్ లో 7-6,7-5,7-5 పాయింట్లతో ఘన విజయం సాధించాడు.

ఈ విజయంతో ఆదివారం ఫైనల్లో అడుగుపెట్టాడు. బెరెటినిపై చెమటోడ్చి విజయం సాధించి 20వ గ్రాండ్ స్లాం టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఈ టైటిల్ తో జకోవిచ్ రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ లిస్టులో చేరాడు.