Novak Djokovic: జకోవిచ్ వీసా క్యాన్సిల్, మూడేళ్ల నిషేదం

వరల్డ్ టెన్నిస్ నెంబర్.1 జకోవిచ్ పై ఆస్ట్రేలియా ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. మరోసారి వీసాను రద్దు చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.

Novak Djokovic: జకోవిచ్ వీసా క్యాన్సిల్, మూడేళ్ల నిషేదం

Novak Djokovic

Novak Djokovic: వరల్డ్ టెన్నిస్ నెంబర్.1 జకోవిచ్ పై ఆస్ట్రేలియా ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. మరోసారి వీసాను రద్దు చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇమిగ్రేషన్ మినిష్టర్ అలెక్స్ హాకె మాట్లాడుతూ.. ‘పబ్లిక్ ఇంటరెస్ట్ మేరకే ఆరోగ్యం, మంచి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని అన్నారు.

ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ ప్రభుత్వం.. ఆస్ట్రేలియా సరిహద్దుల్లోకి కొవిడ్ ఎంటర్ అవకుండా ఉండేందుకు ప్రొటెక్షన్ తీసుకునే పనిలో భాగంగా నిర్ణయం తీసుకున్నామని స్టేట్మెంట్ లో వెల్లడించింది. దాంతో పాటు మూడేళ్ల పాటు జకోవిచ్ కు ఎటువంటి వీసాను ఇచ్చేందుకు సిద్ధంగా లేమని చెప్పింది.

పదో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్, పెరిల్ లో 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాలనే కలలకు వీసా నిర్ణయం తలనొప్పి తెచ్చింది. నిర్ణయం ప్రకటించడానికి కొద్ది గంటల ముందు వరకూ జకోవిచ్ మెల్‌బౌర్న్ పార్క్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు.

ఇది కూడా చదవండి : వరుస పాన్ ఇండియా లైనప్‌తో సుకుమార్