Hockey World Cup 2023: హాకీ ప్రపంచ కప్ విలేజ్‌ను ప్రారంభించిన ఒడిశా సీఎం.. గెలిస్తే రూ.కోటి చొప్పున ఇస్తానన్న పట్నాయక్
ఒడిశాలో జరగనున్న హాకీ ప్రపంచ కప్-2023లో విజేతగా నిలిస్తే భారత జట్టులోని ప్రతి ఆటగాడికీ రూ.కోటి చొప్పున నజరానా ఇస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. మరో వారం రోజుల్లో ఒడిశాలోని కళింగ స్టేడియంలో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.

Hockey World Cup 2023: ఒడిశాలో జరగనున్న హాకీ ప్రపంచ కప్-2023లో విజేతగా నిలిస్తే భారత జట్టులోని ప్రతి ఆటగాడికీ రూ.కోటి చొప్పున నజరానా ఇస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. మరో వారం రోజుల్లో ఒడిశాలోని కళింగ స్టేడియంలో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియాతో నవీన్ పట్నాయక్ ఇవాళ మాట్లాడారు.
ఈ ప్రపంచ కప్ ను గెలిచి, ఛాంపియన్లుగా నిలవాలని అన్నారు. అలాగే, ఇవాళ రూర్కెలాలోని బిర్సా ముందా హాకీ స్టేడియం కాంప్లెక్స్ వద్ద ప్రపంచ కప్ విలేజ్ ను ఆయన ప్రారంభించారు. ఈ వరల్డ్ కప్ విలేజ్‌ను రికార్డు స్థాయిలో అతి స్వల్ప కాల వ్యవధిలో నిర్మించారు. అన్ని అత్యాధునిక సౌకర్యాలతో 9 నెలల్లో 225 గదులు నిర్మించారు.
హాకీ ప్రపంచ కప్ కు కావాల్సిన రీతిలో దీన్ని తీర్చిదిద్దారు. ప్రపంచ కప్ ఆడేందుకు వచ్చే దేశాల జట్లు, అధికారులు వరల్డ్ కప్ విలేజ్‌లో ఉంటారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒడిశాకు చెందిన పలువురు మంత్రులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. కాగా, హాకీ ప్రపంచ కప్ ను ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ నాలుగేళ్లకు ఒసారి నిర్వహిస్తుంది.
Glad to meet and interact with the Indian Hockey team members at Birsa Munda Hockey Stadium in #Rourkela ahead of the #HockeyWorldCup2023. Wish all of them very best as they are raring to go and give their best to bring laurels for the country. #OdishaForHockey #HockeyComesHome pic.twitter.com/bzTHtIDs46
— Naveen Patnaik (@Naveen_Odisha) January 5, 2023
Birsa Munda Stadium, world’s biggest hockey stadium is now a reality in just 15 months. Congratulate everyone who worked tirelessly to turn the grand vision, a reality. I am sure, it will emerge as the best venue for field hockey in the world.#HockeyComesHome#OdishaForHockey pic.twitter.com/WDWKVcebe1
— Naveen Patnaik (@Naveen_Odisha) January 5, 2023
As hockey comes home to #Odisha, we celebrate the spirit of hockey across the nation. With every heart in the nation beating as one for hockey, let’s us all join to cheer for team India. Let the passion for the game spread to billion hearts.#HWC2023#HockeyComesHome pic.twitter.com/h62ckJ10uS
— Naveen Patnaik (@Naveen_Odisha) January 4, 2023