ఒకప్పుడు ఒలింపిక్ ఛాంపియన్, ఇప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్

  • Published By: madhu ,Published On : November 17, 2020 / 03:58 AM IST
ఒకప్పుడు ఒలింపిక్ ఛాంపియన్, ఇప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్

Olympic Champion – Ruben Limardo :  ఒకప్పుడు అతను ఒలింపిక్ ఛాంపియన్. ఇప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్. కుటుంబ పోషణకు అలా మారాల్సి వచ్చింది. వెనిజులా లాంటి దేశం నుంచి వచ్చిన ఆటగాడి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. 2012 లండన్ ఒలింపిక్స్ లో ఫెన్సింగ్ క్రీడాంశంలో పతకం నెగ్గాడు వెనిజులా ఫెన్సింగ్ క్రీడాకారుడు రూబెన్ లిమార్డో. తర్వాత..ఇతనికి ఏమీ కలిసి రాలేదు. 2016 రియో ఒలింపిక్స్ లో విఫలమయ్యాడు. అయినా..సరే..టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధమౌతున్నాడు.



35 ఏళ్ల లిమార్డో యూరోపియన్ దేశం పోలాండ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. కానీ…స్పానర్ షిప్ నుంచే వచ్చే డబ్బులతో అంతా సవ్యంగానే సాగింది. కరోనా ఒక్కసారిగా అతని జీవితాన్ని అతలాకుతలం చేసేసింది. టోక్యో క్రీడలు వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డాయి. దీంతో స్పానర్స్ కూడా వెనక్కి తగ్గారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము అండగా నిలవలేమని చేతులెత్తేశారు. ఓ వైపు ట్రైనింగ్, భార్య, ఇద్దరు పిల్లల పోషణ చూసుకోవాల్సి ఉంది.



క్రీడాకారుడిగా ఉన్న ఇతనికి వేరే పనుల గురించి తెలియదు. కుటుంబ పోషణ కోసం లిమార్డో ‘ఉబెర్ ఈట్స్’ డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. ఉదయమే ప్రాక్టిస్ ముగించుకున్న అనంతరం తన సైకిల్ పై వచ్చిన ఫుడ్స్ ఆర్డర్లు అందించేందుకు వెళుతున్నాడు. సాయంత్రం మళ్లీ వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అయితే..డెలివరీ బాయ్ గా పనిచేయడం పట్ల తాను బాధ పడడం లేదని, కరోనా కాలంలో ఒక ఆధారం దొరికినందుకు సంతోషిస్తున్నట్లు లిమార్డో వెల్లడిస్తున్నాడు. మరో ఒలింపిక్ పతకం తన కల అని, ఇందుకోసం ఎంతకైనా కష్టపడుతానంటున్నాడు. అతని స్వదేశం వెనిజులా నుంచి ఏమి ఆశించడం లేదు.