లంక పర్యటనకు సిద్ధమైన టీమిండియా

  • Published By: Subhan ,Published On : May 16, 2020 / 10:56 AM IST
లంక పర్యటనకు సిద్ధమైన టీమిండియా

లాక్‌డౌన్, క్వారంటైన్ అన్ని నిబంధనలకు అనుగుణంగానే కరోనా వైరస్ జాగ్రత్తలు దృష్టిలో ఉంచుకుని లంక పర్యటనకు భారత జట్టు సిద్ధమవుతోంది. లంక జట్టుతో వన్డేలతో పాటు, టీ20లు ఆడేందుకు జూన్-జులై మధ్య కాలంలో వెళ్లనున్నట్లు బీసీసీఐ ట్రెజరర్ పరోక్షంగా ఆన్సర్ ఇచ్చారు. ప్లేయర్ ఆరోగ్యానికి భయపడి లంకతో సిరీస్ వదిలేసుకున్నట్లేనా అని అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు.

‘అదంతా ప్రభుత్వ ఆదేశాలపై ఆధారపడి ఉంటుంది. లాక్‌డౌన్ రిలాక్సేషన్ ఉన్నప్పుడు మేం ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్నాం. అదే సమయంలో ప్లేయర్ల ఆరోగ్యం గురించి అదే స్థాయిలో శ్రద్ధ తీసుకుంటాం’ అన్నారు. శుక్రవారం శ్రీలంక క్రికెట్ బోర్డు ద్వైపాక్షిక సిరీస్  గురించి బీసీసీఐకు లేఖ రాసింది. 

లంక క్రికెట్ బోర్డు టీమిండియాతో ఆరు వైట్ బాల్ క్రికెట్ మ్యాచ్ లు ఆడేందుకు సన్నద్ధత చూపిస్తుంది. మ్యాచ్ ను క్లోజ్‌డ్ డోర్ల మధ్య నిర్వహిస్తూనే ప్లేయర్లకు అన్ని క్వారంటైన్ రూల్స్ క్రమం తప్పకుండా పాటిస్తుందని బోర్డు చెప్పింది. దానికి రిప్లై ఇచ్చిన బీసీసీఐ.. మేం ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తాం. జూన్-జులై నెల్లో మూడు వన్డేలు, మూడు టీ20లు లంకతో ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని బదులిచ్చింది. 

సిరీస్ జరుగుతుందా అంటే:
అంత త్వరగా చెప్పడం చాలా కష్టం. ఇండియా మే 17వరకూ లాక్‌డౌన్ పీరియడ్ లో ఉంటుంది. ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తేస్తే ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడతారని చెప్పగలం. లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్లేయర్లు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వారు రెండు నెలలుగా ట్రైనింగ్ లో లేరు. 

టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానె .. మ్యాచ్ లకు వెళ్లే ముందు ప్లేయర్లకు ఒక నెల ట్రైనింగ్ అవసరమని.. లంకతో మ్యాచ్ లో ఓ రెండు వారాలపాటు వాయిదా పడే అవకాశం ఉందని అన్నాడు. 

Read Here>> క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మే 22 నుంచి లీగ్‌ ప్రారంభం