WTC Final Ind vs NZ: రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. క్రీజులో పుజారా, కోహ్లీ!

భారత్, న్యూజిలాండ్ మధ్య ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ సౌతాంప్టన్‌లో జరుగుతోంది. మొదటి రోజు ఆట వర్షం కారణంగా ఆగిన ఆట.. రెండవ రోజు కొనసాగుతుంది.

WTC Final Ind vs NZ: రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. క్రీజులో పుజారా, కోహ్లీ!

Lunch Break

WTC Final Ind vs NZ Live Update: భారత్, న్యూజిలాండ్ మధ్య ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ సౌతాంప్టన్‌లో జరుగుతోంది. మొదటి రోజు ఆట వర్షం కారణంగా ఆగిన ఆట.. రెండవ రోజు కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోగా.. వార్తలు రాసే వరకు, లంచ్ బ్రేక్ సమయానికి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో, టీమిండియా 28 ఓవర్లలో 69 పరుగులు చేసి రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో పూజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నారు.

జేమీసన్‌ వేసిన 20.1 ఓవర్‌కు ఓపెనర్‌ రోహిత్‌శర్మ 68 బంతుల్లో 34పరుగులు చేసి అవుటయ్యాడు. స్లిప్‌లో సౌథీ చేతికి చిక్కడంతో భారత్‌ 62 పరుగుల వద్ద ఫస్ట్ వికెట్‌ కోల్పోయింది. తర్వాత కాసేపటికి యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్ 28పరుగులు చేసి అవుటయ్యాడు. 64బంతుల్లో 28పరుగులు చెయ్యగా.. వాగ్నర్ బౌలింగ్‌లో వాట్లింగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

తొలి గంటలో భారత్‌ మెరుగ్గా ఆడినప్పటికీ, ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ వెంటనే అవుట్ అవ్వడంతో టీమిండియా కాస్త కష్టాల్లో పడినట్లుగా అనిపిస్తుంది. ఈమ్యాచ్‌‍లో భారత క్రీడా దిగ్గజం మిల్కా సింగ్‌కు బీసీసీఐ నివాళి అర్పించింది. ఆయన స్మారకార్థం భారతజట్టు క్రికెటర్లు నల్లరంగు బ్యాండ్లు ధరించి క్రికెట్‌ ఆడుతున్నారు. ప్రస్తుతం 12బంతుల్లో 6పరుగులు చేసి కోహ్లీ క్రీజులో ఉండగా.. 24బంతుల్లో పరుగులేమీ చేయకుండా పుజారా క్రీజులో ఉన్నారు.