PAK vs NZ: పాకిస్తాన్‌కు భారీ దెబ్బ.. భద్రతా కారణాలతో న్యూజిలాండ్ సిరీస్ రద్దు

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ నేటి నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సి ఉండగా.. భద్రతా కారణాల దృష్ట్యా న్యూజిలాండ్.. పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుంది.

PAK vs NZ: పాకిస్తాన్‌కు భారీ దెబ్బ.. భద్రతా కారణాలతో న్యూజిలాండ్ సిరీస్ రద్దు

Pak Nz (1)

PAK vs NZ: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ నేటి నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సి ఉండగా.. భద్రతా కారణాల దృష్ట్యా న్యూజిలాండ్.. పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుంది. 18 సంవత్సరాల తర్వాత, న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు రాగా.. ఈ పర్యటనలో, న్యూజిలాండ్ మూడు వన్డేల సిరీస్ మరియు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నేటి నుంచి ప్రారంభం కావల్సి ఉండగా.. భద్రతా కారణాల దృష్ట్యా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పాకిస్థాన్ పర్యటన మొత్తాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది. అయితే, ఈ సిరీస్ తరువాత ఆడతామని, ప్రస్తుతానికి వాయిదా మాత్రమే వేసినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చెబుతోంది.

భద్రతా ముప్పు ‘పెరిగిన’ కారణంతో న్యూజిలాండ్ పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసింది. న్యూజిలాండ్ క్రికెట్ (NZC) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ తమకు అందుతున్న సూచనల మేరకు పర్యటనను కొనసాగించడం సాధ్యం కాదని, “ఇది అద్భుతమైన ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు దెబ్బ అని మేం అర్థం చేసుకున్నాం. కానీ ఆటగాళ్ల భద్రత మాకు చాలా ముఖ్యం. అది మాత్రమే బాధ్యతాయుతమైన ఎంపిక అని మేము నమ్ముతున్నాము,” అని చెప్పారు వైట్.

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక ప్రకటనలో, న్యూజిలాండ్ ప్రభుత్వం నుంచి పాకిస్తాన్‌లో ప్రమాదం గురించి తెలుసుకున్నాం. ప్రమాదం గురించి తెలుసుకున్న తర్వాత కూడా మొండిగా ఆడలేం కాబట్టి.. కివీ బృందం ఈ పర్యటనను కొనసాగించకుండా నిర్ణయం తీసుకున్నాం. జట్టు తిరిగి రావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వైట్ చెప్పారు. అయితే, సెక్యూరిటీ కారణాలతో పాకిస్తాన్ టూర్‌ను రద్దు చేసుకుంటున్నట్టు న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించడంపై అభిమానులు మాత్రం దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు.