‘పాకిస్తాన్‌లో టాలెంట్ చాలా ఎక్కువ.. ఇండియన్ ప్లేయర్లతో పోల్చలేం’

ఇటీవలి క్రికెట్ డిస్కషన్స్ లో ఎక్కువగా వినిపిస్తన్న పోలిక విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్. సాధించిన ప్రతి ఫీట్‌కు మాజీ క్రికెటర్లు వీరిద్దరి మధ్యే పోలికలు వినిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు వారిలో పాకిస్తాన్ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ కూడా

‘పాకిస్తాన్‌లో టాలెంట్ చాలా ఎక్కువ.. ఇండియన్ ప్లేయర్లతో పోల్చలేం’

virat kohli babar azam

Pakistan Cricket: ఇటీవలి క్రికెట్ డిస్కషన్స్ లో ఎక్కువగా వినిపిస్తన్న పోలిక విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్. సాధించిన ప్రతి ఫీట్‌కు మాజీ క్రికెటర్లు వీరిద్దరి మధ్యే పోలికలు వినిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు వారిలో పాకిస్తాన్ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ కూడా కలిసిపోయారు. వారిని అలా పోల్చడం తప్పని చెబుతున్నారు.

రజాక్ ఉద్దేశ్యం ప్రకారం.. పాకిస్తాన్ లో చాలా టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. అటువంటివారిని పోల్చడం అనేది చాలా తప్పు. పాకిస్తాన్ క్రికెట్ ఆడుతున్న సమయం జరిగిన ఇంటర్వ్యూలో.. అజామ్ – కోహ్లీల మధ్య కంపేరిజన్ గురించి ప్రశ్నించారు.

మా చరిత్ర గురించి చూస్తే.. చాలా మంది గ్రేట్ ప్లేయర్లు ఉన్నారు. మొహమ్మద్ యూసఫ్, ఇంజమాముల్ హక్, సయ్యద్ అన్వర్, జావేద్ మియాందాద్, జహీర్ అబ్బాస్, ఇజాజ్ అహ్మద్ లాంటి వాళ్లు.

విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్ లు పూర్తిగా డిఫరెంట్ ప్లేయర్లు. వారిద్దరినీ పోల్చి చూడాలనుకుంటే.. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ పెట్టాలి. అప్పుడే బెటర్ ప్లేయర్ ఎవరో చెప్పాలి అని ఆయన అభిప్రాయపడ్డారు.

విరాట్ కోహ్లీ మంచి ఆటగాడు. పాకిస్తాన్ తో ఆడిన మ్యాచ్ లో మంచి ఆటనే కనబరిచాడు. అతనిపై నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. పాకిస్తాన్ ప్లేయర్లతో ఇండియన్ ప్లేయర్లను పోల్చవద్దు. అప్పుడే మేం కూడా పోల్చం. అని చెప్పాడు.

ఇక బాబర్ అజామ్ గురించి మాట్లాడుతూ.. ‘నా నేతృత్వంలో అతను ఐదారు సంవత్సరాలు ఆడాడు. అతణ్ని కెప్టెన్ గా ఎప్పుడూ తగ్గించలేదు. అతను చాలా టాలెంటెడ్, డీసెంట్ బ్యాట్స్ మన్. అంతర్జాతీయస్థాయి ఆటలో నిరూపించుకున్నాడు. అలా చూస్తూ ఉంటే అన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు.