ICC Rankings: వ‌న్డేల్లో నెంబ‌ర్ వ‌న్ ర్యాంకు.. పాకిస్థాన్ ది రెండు రోజుల‌ మురిప‌మే.. భార‌త్ మ‌ళ్లీ

రెండు రోజుల క్రితం వ‌న్డేల్లో పాకిస్థాన్ నెంబ‌ర్ వ‌న్ ర్యాంకును సొంతం చేసుకోగానే ఆ జ‌ట్టు అభిమానుల‌తో పాటు ప‌లువురు మాజీ ఆట‌గాళ్లు చెల‌రేగిపోయారు. టీమ్ఇండియాను తెగ ట్రోలింగ్ చేశారు. అయితే వారి ఆనందం ఎక్కువ రోజులు నిల‌వ‌లేదు.

ICC Rankings: వ‌న్డేల్లో నెంబ‌ర్ వ‌న్ ర్యాంకు.. పాకిస్థాన్ ది రెండు రోజుల‌ మురిప‌మే.. భార‌త్ మ‌ళ్లీ

Pakistan

ICC Rankings: రెండు రోజుల క్రితం వ‌న్డేల్లో పాకిస్థాన్(Pakistan) నెంబ‌ర్ వ‌న్ ర్యాంకును సొంతం చేసుకోగానే ఆ జ‌ట్టు అభిమానుల‌తో పాటు ప‌లువురు మాజీ ఆట‌గాళ్లు చెల‌రేగిపోయారు. టీమ్ఇండియా(Team India)ను తెగ ట్రోలింగ్ చేశారు. అయితే వారి ఆనందం ఎక్కువ రోజులు నిల‌వ‌లేదు. 48 గంట‌లు అంటే స‌రిగ్గా రెండు రోజుల్లోనే పాక్ టాప్ ర్యాంకును కోల్పోయింది. న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఐదో వ‌న్డేలో ఓడిపోవ‌డ‌మే అందుకు కార‌ణం.

న్యూజిలాండ్ జ‌ట్టు పాకిస్థాన్‌లో ప‌ర్య‌టిస్తోంది. గాయాల కార‌ణంగా ప‌లువురు కివీస్ కీల‌క ఆట‌గాళ్లు ఈ టూర్‌కు దూరంగా ఉన్నారు. ఐదు వ‌న్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జ‌రిగిన ఆఖ‌రి వ‌న్డేలో పాక్ ఓడిపోయింది. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసే సువ‌ర్ణావ‌కాశాన్ని పాక్ చేజార్చుకోవ‌డంతో పాటు టాప్ ర్యాంకును నిల‌బెట్టుకునే అవ‌కాశాన్ని కోల్పోయింది.

IPL 2023, KKR vs PBKS: ఈ లెక్క‌న పంజాబే గెలుస్తుంద‌ట‌.. ఇదేం లాజిక్ అండీ బాబు..?

పాకిస్థాన్ ఓడిపోవ‌డంతో ఆస్ట్రేలియా, టీమ్ఇండియాలు తొలి రెండు స్థానాల‌కు ఎగ‌బాకగా పాక్ మూడో స్థానానికి ప‌డిపోయింది. ఆస్ట్రేలియా, భార‌త్ ఖాతాల్లో 113 రేటింగ్ పాయింట్లు ఉండ‌గా పాకిస్థాన్‌కు 112 పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్‌(111), న్యూజిలాండ్‌(108), ద‌క్షిణాఫ్రికా (101) లు నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.3 ఓవ‌ర్ల‌లో 299 ప‌రుగుల‌కు ఆలౌటైంది. విల్ యంగ్‌(87; 91 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), టామ్ లాథ‌మ్‌(59; 58 బంతుల్లో 5 ఫోర్లు) లు హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. చాప్‌మన్‌ (43), రచిన్‌ రవీంద్ర (28), హెన్రీ నికోల్స్‌ (23) ప‌ర్వాలేద‌నిపించారు. పాకిస్థాన్ బౌల‌ర్ల‌లో షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు తీయ‌గా ఉసామా మిర్‌, షాదాబ్ ఖాన్ చెరో రెండు, హ‌రీస్ రౌఫ్, మ‌హ్మ‌ద్ వ‌సీం ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

IPL 2023: ఆఖ‌రి బంతికి స‌మ‌ద్ స్ట్రైక్‌కు ఎలా వ‌చ్చాడు..? అలా రావొచ్చా..?

ఇఫ్తికార్‌ అహ్మద్‌(94 72 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) పోరాడిన‌ప్ప‌టికీ 46.1 ఓవ‌ర్ల‌లో పాకిస్థాన్ 252 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆగా స‌ల్మాన్‌(57 57 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించిన‌ప్ప‌టికి మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో 47 ప‌రుగుల‌తో ఓడిపోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ షిప్లే, రచిన్‌ రవీంద్ర చెరో మూడు వికెట్లు తీయ‌గా ఆడమ్‌ మిల్నే, మ్యాట్‌ హెన్రీ, ఐష్‌ సోధి ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు. ఆఖ‌రి మ్యాచ్‌లో విజ‌యం సాధించిన‌ప్ప‌టికి న్యూజిలాండ్ 1-4తో సిరీస్‌ను కోల్పోయింది.