ACB : పాక్ – అప్ఘాన్ మ్యాచ్‌‌కు తాలిబన్లు గ్రీన్ సిగ్నల్!

సెప్టెంబర్ 01వ తేదీ నుంచి 05వ తేదీ వరకు శ్రీలంకలోని హంబన్ తోట వేదికగా..పాక్ - అప్ఘాన్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఇటీవలే ఫిక్స్ అయ్యింది.

ACB : పాక్ – అప్ఘాన్ మ్యాచ్‌‌కు తాలిబన్లు గ్రీన్ సిగ్నల్!

Pak

Pakistan ODI : శ్రీలంక వేదికగా అప్ఘాన్ – పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందా ? ఈ రెండు జట్ల మధ్య జరిగే వన్డే సిరీస్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. సెప్టెంబర్ 01వ తేదీ నుంచి 05వ తేదీ వరకు శ్రీలంకలోని హంబన్ తోట వేదికగా..పాక్ – అప్ఘాన్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఇటీవలే ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలో…అఫ్ఘానిస్తాన్ ను తాలిబన్లు వశం చేసుకున్న సంగతి తెలిసిందే.

Read More : Alexa Celebrity Voice : అలెక్సాలో అమితాబ్‌ బచ్చన్‌‌తో ఇలా మాట్లాడొచ్చు..!

ప్రస్తుతం అక్కడ దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్లు మొదటి నుంచి క్రికెట్ కు వ్యతిరేకులు. ఈ నేపథ్యంలో అప్ఘాన్ – పాక్ జట్ల మధ్య మ్యాచ్ పై సందిగ్ధత నెలకొంది. అయితే…ఈ సిరీస్ కు తాలిబన్లు అంగీకారం తెలిపారంటూ…పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పేర్కొనడం సంచలనమైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే సిరీస్ యదావిధిగా కొనసాగుతుందని చెప్పడంతో క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది.

Read More : Audio Tape Issue : అది ఫేక్ ఆడియో, కొందరు కుట్ర చేశారు – మంత్రి అవంతి

మరోవైపు…పాక్ లో న్యూజిలాండ్ జట్టు పర్యటించాల్సి ఉంది. కానీ..ఈ జట్టుకు తాలిబన్ల భయం వేధిస్తోంది. పాక్ పొరుగు దేశమైన అప్ఘానిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో…పలువురు కివీస్ ఆటగాళ్లు..పాక్ పర్యటనకు నో చెబుతున్నారని తెలుస్తోంది. దీనిపై న్యూజిలాండ్ బోర్డు అంతర్జాతీయ సెక్యూర్టీ కన్సల్టెంట్, నిపుణుడు రెగ్ డికాసన్ ను ఆశ్రయించింది. వారం తర్వాత..పాక్ ను సందర్శించి…భద్రత, కోవిడ్ 19కు సంబంధించిన పరిస్థితులపై అంచనా వేయాలని సూచించింది. ఆయన ఇచ్చే నివేదికపై కివీస్ జట్టు పాక్ లో పర్యటించాలా ? వద్దా ? అనేది తేలనుంది.