World Test Championship: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి పాకిస్థాన్ ఔట్.. ఐసీసీ ఏమన్నదంటే?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023 సంవత్సరం ప్రారంభ రోజున పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుండి పాకిస్తాన్ జట్టు ఔట్ అయింది. ఈ విషయాన్ని ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ధృవీకరించింది.

World Test Championship: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి పాకిస్థాన్ ఔట్.. ఐసీసీ ఏమన్నదంటే?

World Test Championship_

World Test Championship: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ ఫైనల్ ఆడాలనే పాకిస్థాన్ జట్టు కల ఈసారికూడా నెరవేరదు. ఆ విషయంలో పాకిస్థాన్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫైనల్ రేసు నుంచి పాకిస్థాన్ ఔట్ అయింది. ఐసీసీ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇటీవలే ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ 3-0 తేడాతో ఓడిపోయిన విషయం విధితమే. ఈ ఓటమితో డబ్ల్యూటీసీ (వరల్డ్ టెస్ట్ ఛాపింయన్ షిప్) పాయింట్ల పట్టికలో దిగువకు పడిపోయింది.

Bangladesh Cricket Coach: టీమిండియా టెస్ట్ సిరీస్ ఎఫెక్ట్.. బంగ్లా జట్టు కోచ్ రాజీనామా

కరాచీలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్‌లోని మొదటి టెస్టు డ్రా కావడంతో పాకిస్థాన్ ఇకపై ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించే అవకాశం లేకుండా పోయింది. రెండో టెస్టు లో పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్ ను ఓడించినప్పటికీ బాబర్ అజామ్ జట్టు అర్హత సాధించేందుకు గరిష్ఠంగా 42.85శాతం పరుగులు సాధిస్తుంది.

Cricketer Ravindra Jadeja: భార్యను ప్రశంసిస్తూ రవీంద్ర జడేజా ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్లు ..

ప్రపంచ టెస్ట్ క్రికెట్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఏడవ స్థానంలో ఉంది. 2021-23 మధ్య కాలంలో పాకిస్థాన్ జట్టు ఇప్పటి వరకు మొత్తం 13 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో నాలుగు విజయం సాధించగా, ఆరు మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. దీంతో ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఐసీసీ పాయింట్ల పట్టికలో 38.46శాతం మార్కులతో ఉంది. ఒకవేళ ప్రస్తుతం పాకిస్థాన్ గడ్డపై జరిగే పాక్ – న్యూజీలాండ్ రెండో టెస్టు మ్యాచ్ లో పాకిస్థాన్ విజయం సాధిస్తే అది 42.85కు చేరుతుంది. అయినప్పటికీ ప్రపంచ టెస్ట్ క్రికెట్ ఫైనల్స్‌లో చోటు దక్కించుకొనే పరిస్థితి లేదు.

 

ఇదిలాఉంటే ఈ ఏడాది జూన్ నెలలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతుంది.  అయితే, ఐసీసీ ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన తేదీలను వెల్లడించలేదు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్‌లో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య  ఈ మ్యాచ్ జరుగుతుంది. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా ఉండగా, రెండో స్థానంలో భారత్ జట్టు నిలిచింది.