Pakistan Pacer’s viral video: చివరి ఓవర్లో సిక్సు కొట్టి పాక్‌ను గెలిపించిన తర్వాత నసీమ్‌ షా మైదానంలో ప్రవర్తించిన తీరు వైరల్

పాక్ ఆటగాడు నసీమ్‌ షా.. లాంగాఫ్‌ మీదుగా సిక్స్‌లు బాదాడు. పాకిస్థాన్ గెలవడంతో అతడి సంబరం అంబరాన్నంటింది. బౌలర్ అయుండి, అద్భుతంగా బ్యాటింగ్ చేసి పాక్ ను గెలిపించ గర్వంతో మైదానంలో బ్యాట్, హెల్మెట్, గ్లోవ్స్ పడేసి పరుగులు తీశాడు. అతడి వీరవిహారం అందరినీ ఆశ్చర్యపర్చింది. పాక్ గెలవడంతో మైదానంలోకి పరుగులు తీస్తూ వచ్చిన పాక్ ఇతర ఆటగాళ్ళు నసీమ్‌ షాని అభినందించారు.

Pakistan Pacer’s viral video: చివరి ఓవర్లో సిక్సు కొట్టి పాక్‌ను గెలిపించిన తర్వాత నసీమ్‌ షా మైదానంలో ప్రవర్తించిన తీరు వైరల్

Pakistan Pacer's viral video

Pakistan Pacer’s viral video: ఆసియా కప్‌లో భాగంగా నిన్న అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచులో పాకిస్థాన్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో లక్ష్య ఛేదనలో తొమ్మిది వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా, తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పాక్ ఓడిపోతుందని అందరూ భావించగా, అఫ్గాన్ బౌలర్ ఫారూఖీ యార్కర్ల కోసం ప్రయత్నించి, చివరి ఓవర్ తొలి 2 బంతుల్లో ఫుల్‌టాస్‌లు వేశాడు.

దీంతో పాక్ ఆటగాడు నసీమ్‌ షా.. లాంగాఫ్‌ మీదుగా సిక్స్‌లు బాదాడు. పాకిస్థాన్ గెలవడంతో అతడి సంబరం అంబరాన్నంటింది. బౌలర్ అయుండి, అద్భుతంగా బ్యాటింగ్ చేసి పాక్ ను గెలిపించ గర్వంతో మైదానంలో బ్యాట్, హెల్మెట్, గ్లోవ్స్ పడేసి పరుగులు తీశాడు. అతడి వీరవిహారం అందరినీ ఆశ్చర్యపర్చింది. పాక్ గెలవడంతో మైదానంలోకి పరుగులు తీస్తూ వచ్చిన పాక్ ఇతర ఆటగాళ్ళు నసీమ్‌ షాని అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Mamata on opposition unity: మేమందరం ఒక్కటవుతాం.. వచ్చే లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి తీరతాం: మమతా బెనర్జీ