Danish Kaneria: ఆ విషయంలో టీమిండియాను చూసి పాకిస్థాన్ చాలా నేర్చుకోవాలి ..

టీమిండియా తరహాలో పాకిస్థాన్ జట్టు ఎందుకు ప్రయత్నం చేయడం లేదని పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ప్రశ్నించారు. మాజీ స్పిన్నర్ మహ్మద్ హారిస్‌కు సరియైన అవకాశం ఇవ్వటం లేదని, మహ్మద్ రిజ్వాన్‌కు బ్యాకప్‌గా మహ్మద్ హారిస్‌కు ప్రాధాన్యం ఇవ్వకపోవటం పట్ల కనేరియా పాక్ జట్టు మేనేజ్‌మెంట్ తీరును తప్పుబట్టారు.

Danish Kaneria: ఆ విషయంలో టీమిండియాను చూసి పాకిస్థాన్ చాలా నేర్చుకోవాలి ..

Danish Kaneria

Danish Kaneria: వన్డే ప్రపంచకప్‌కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. బిజీబిజీ షెడ్యూల్‌తో వరుస మ్యాచ్‌లు ఆడుతోంది. ఇప్పటికే శ్రీలంక, న్యూజిలాండ్‌ జట్లపై వరుస విజయాలు సాధించిన భారత్ జట్టు వన్డే ప్రపంచ‌కప్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టింది. ఆటగాళ్లు ఎక్కువగా అలసిపోకుండా, గాయాలబారిన పడకుండా వారికి మ్యాచ్‌ల మధ్యలో విశ్రాంతినిస్తూ కొత్తవారికి అవకాశం కల్పిస్తుంది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండు వన్డేల్లో విజయం సాధించిన భారత్ జట్టు.. మంగళవారం జరిగే మ్యాచ్‌లో‌సైతం విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసేందుకు సన్నద్ధమవుతోంది.

Danish Kaneria Sensational Allegations : నేను హిందువుని కావడంతో అఫ్రిది విపరీతంగా ద్వేషించే వాడు- మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు

మరోవైపు ఇటీవల కాలంలో స్వదేశంలో న్యూజిలాండ్‍‌తో జరిగిన వన్డే సిరీస్‌ను పాకిస్థాన్ జట్టు 1-2తో చెత్త ప్రతిభను కనబర్చింది. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచ కప్‌కు సన్నద్ధమవుతున్నప్పుడు టీమిండియాను చూసి పాకిస్థాన్ చాలా నేర్చుకోవాలని కనేరియా సూచించారు. ఈ క్రమంలో కనేరియా ఇషాన్ కిషన్ ను ఉదాహరణగా చెప్పాడు. రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం తర్వాత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా భారత్ జట్టు ఇషాన్ కిషన్‌ను సిద్ధం చేశారని తెలిపాడు.

 

భారత్ తరహాలో పాకిస్థాన్ ఎందుకు చేయలేకపోతుందని కనేరియా ప్రశ్నించారు. మాజీ స్పిన్నర్ మహ్మద్ హారిస్‌కు తగినంత ఎక్స్‌పోజర్ ఇవ్వటం లేదని కనేరియా అన్నారు. మహ్మద్ రిజ్వాన్‌కు బ్యాకప్‌గా మహ్మద్ హారిస్‌కు తగినంత ప్రాధాన్యం ఇవ్వకపోవటం పట్ల కనేరియా పాక్ జట్టు మేనేజ్‌మెంట్ తీరును తప్పుబట్టారు. పాకిస్తాన్‌లో డెడ్ పిచ్‌లను సృష్టించినందుకు కనేరియా పీసీబీ, క్యూరేటర్‌లను కూడా తప్పుబట్టారు.