ICC Awards: ఐసీసీ మెన్స్‌ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్.. టెస్టు క్రికెట్‌లో బెన్ స్టోక్ ..

2022 సంవత్సరానికి సంబంధించిన మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ఐసీసీ ప్రకటించింది. మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఎంపికయ్యారు. ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్ దక్కించుకుంది.

ICC Awards: ఐసీసీ మెన్స్‌ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్.. టెస్టు క్రికెట్‌లో బెన్ స్టోక్ ..

pakistan captain

ICC Awards: 2022 సంవత్సరానికి సంబంధించిన మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ఐసీసీ ప్రకటించింది. మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఎంపికయ్యారు. ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్ దక్కించుకుంది. ప్రతీయేటా ఐసీసీ మెన్స్, ఉమెన్స్ క్రికెట్‌కు సంబంధించి అవార్డులను ప్రకటిస్తుంది. తాజాగా 2022లో ప్రతిభచూపిన క్రీడాకారులను ఎంపికచేసిన ఐసీసీ పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించింది. ఇప్పటికే 2022 సంవత్సరానికి సంబంధించి వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కైవసం చేసుకున్న బాబర్.. తాజాగా మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు.

ICC Awards: ఐసీసీ అత్యుత్తమ పురుషుల టీ20 జట్టులో భారత్ ఆటగాళ్ల హవా.. టీమ్ కెప్టెన్‌గా జోస్ బట్లర్

ఇప్పటికే భారత్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఐసీసీ ఎంపిక చేసింది. తాజాగా, ఐసీసీ మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ ఎంపికయ్యాడు. 2022 సంవత్సరానికిగాను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన బాబర్ అజామ్ మూడు ఫార్మాట్లలో గత ఏడాది 44 మ్యాచ్‌లు ఆడాడు. 54.12 సగటుతో 2,598 పరుగులు చేశాడు. ఇందులో 15 ఆఫ్ సెంచరీలు, ఎనిమిది సెంచరీలు ఉన్నాయి. బాబర్ అజామ్ గతేడాది (2021 సంవత్సరానికి సంబంధించి)కూడా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. వరుసగా ఈ ఏడాదికూడా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు బాబర్ నే వరించింది. విరాట్ కోహ్లీ తరువాత రెండు సార్లు వన్డే క్రికెటర్ ఆఫ్ ఆది ఇయర్‌గా ఎంపికయిన మరో ఆటగాడిగా బాబర్ ఘనత సాధించాడు.

 

ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు. గతేడాది టెస్టుల్లో బెన్ స్టోక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చాడు. 15 మ్యాచ్‌లు ఆడిన బెన్‌స్టోక్స్ 36.25 సగటుతో 870 పరుగులు చేసి, 26 వికెట్లు కూడా పడగొట్టాడు. ఆయన ఇప్పటి వరకు నాయకత్వం వహించిన పది టెస్ట్ మ్యాచ్‌లలో తొమ్మిదింటిలో ఇంగ్లాండ్ విజయం సాధించింది.

 

ఇదిలాఉంటే ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డునుసైతం ప్రకటించింది. మహిళల క్రికెట్‌లో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ నాట్ స్కీవర్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2022 సంవత్సరంలో నాట్ స్కివర్ అన్ని ఫార్మాట్లలో 17 మ్యాచ్‌లు ఆడింది. 883 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు పడగొట్టింది. అయితే ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఈ ఏడాది ఐసీసీ నాట్ స్కివర్‌కే కట్టబెట్టింది.